PREMSWAROOP MINISTRIES



A MINISTRY OF GOD'S LOVE AND CARE



"When you give a banquet, invite the poor, the crippled, the lame and the blind and you will be Blessed"

Dr.S.CHANDRA KIRAN
Smt.S.MANJU KIRAN

Home Post New Entry

PRAYER - 3

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on May 17, 2011 at 2:36 AM

     సైతాను ఒక్క ప్రార్థనకు తప్ప మరి దేనికీ భయపడడు అనే విషయాన్ని మనంగుర్తుంచుకోవాలి. మనం ప్రార్థన చేయకుండా ఉండాలనేదే వాడి ఏకైక కోరిక. మనం బైబిలువిద్యార్థులుగా అత్యంత ఆసక్తితో, శ్రద్ధతో చదవుతూఉంటే వాడు వెరువడు. సైతాను మనశ్రమల్ని చూచి నవ్వుతాడు. మన తెలివితేటల్ని చూసి ఎగతాళి  చేస్తాడు. కాని మనం ప్రార్థన చేస్తున్నపుడుమాత్రం గజగజ వణికిపోతాడు.

     మన జీవితంలో దేవునికి మానవున్ని సమీపం చేయగలిగిన అతి గొప్ప కార్యంప్రార్థన ఒక్కటే.

     ప్రయత్నయుక్తమైన పనులకంటే ప్రార్థనతోనే మనం ఎన్నో ఘనకార్యాలనుసాధించగలం. 

     మోకరించే క్రైస్తవుడు ఆయనను కనుక్కొగలుగుతున్నాడు. అదే సమయంలో దేవుడుఅతన్ని కనుగొంటున్నాడు.

ప్రార్థించేవారికి పరిశుద్ధాత్మ శక్తి:

            యేసుక్రీస్తు  పరలోకమునకు ఆరోహణుడయ్యే ముందు తానుఏర్పరచుకొనిన వారితో తండ్రియొక్క వాగ్దానము కొరకు యెరూషలేములోనే ఉండికనిపెట్టమన్నాడు. (అపొ.కా.1:4,5, లూకా 24:49) అట్లు తండ్రి వ‍గ్దానము అయినపరిశుద్ధాత్మతో బాప్తీస్మము పొందుకున్నపుడు వారు శక్తి పొందుకొని యేసుకుసాక్షులుగా ఉంటారని కూడా యేసు చెప్పాడు. (అపొ.కా.1:8) ఇట్లు యేసు శిష్యులును, మరికొందరి స్త్రీలును ఏకమనస్సుతోఎడతెగక ప్రార్థించి పరిశుద్ధాత్మశక్తిని పొందుకున్నారు.(అపొ.కా.1: 13,14, 2:1,4) తండ్రియైనదేవుని ప్రార్థిస్తే యేసుక్రీస్తు ద్వారా మనము పరిశుద్ధాత్మను పొందుకుంటాము లూకా11:13,3:16, యోహాను 7:37-39)

v అలాగు ప్రార్థించిపరిశుద్ధాత్మను పొందుకొనిన అపోస్తలులు బహు బలముగా యేసును గురించి సా‍క్ష్యమియ్యగలిగారు.(అపొ 4:33)

v  స్తెఫను గొప్ప సూచక క్రియలుచేయగలిగాడు.(అపొ:6:3-8).

v  అదివరకు ప్రార్థించిన పేతురు అన్యజనుడైనకొర్నేలీ ఇంటికి వెళ్ళి సువార్తను ప్రకటించగలిగాడు. అపొ.కా. 10:9-48)

v  ప్రార్థన‍ ఫలితంగానే పరిశుద్ధాత్ముడు పౌలు మరియుబర్నబాలను అనేక దేశాలలో వారు సువార్త ప్రకటించుటకు వారిని ప్రత్యేకించుకున్నాడు.(అపొ.కా 6:3-8)

v పౌలు ఏ దేశాలలోసువార్త ప్రకటించాలో లేదా ఏ దేశాలలో సువ‍ర్త ప్రకటించకూడదో పరిశుద్ధాత్ముడే పౌలునుఆదేశించి నడిపించాడు.(అపొ.కా 16:6-10) మరియు పవలుచేత దేవుడు విశేషమైన అద్భుతాలు చేయించాడు.(అపొ.కా.19:11,12)

v యేసుప్రభువు కూడాతాను బాప్తిస్మము పొందిన పిమ్మట ప్రవచనములలో వ్రాయబడినట్లుగా కొలత లేనంతగాపరిశుద్ధాత్మచే అభిషేకించబడ్డాడు. (యెషయా 11:2, 42:1, యొహాను1:32, మత్తయి 3:16,యోహాను 3:34)

v యేసు తన మూడన్నరసంవత్సరముల పరిచర్య పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాతనే ప్రారంభించాడు.అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచాడు. (అపో.కా 10:38)  తాను ప్రార్థించి పరిశుద్ధాత్మ ద్వారానే తన్నుతాను సిలువకు అప్పగించుకొని మనకు రక్షణ సిద్ధము చేశాడు. (హెబ్రీ 9:14) మనము కూడాప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకోవాలి కదా!!!

v ప్రార్థన ఫలితంగామనము పొందుకొను పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు మరియు మనలో ఉంటాడు (యోహాను 14:12-17)

v యేసు చెప్పినసంగతులను మనకు జ్ఞాపకం చేస్తాడు (యోహాను 16:18) మనలో నివసించుచు యేసును గురించిసాక్ష్యమిస్తాడు. (యోహాను 14:12-17)

v మన హృదయములో దేవునిప్రేమను కుమ్మరింపజేస్తాడు. (రోమా 5:5)

v ఆత్మ స్వభావము కలుగజేస్తాడు(రోమా 8:8)

v ఏమి మాట్లాడాలోనేర్పిస్తాడు. (లూకా 12:12)

v మనలనుసర్వసత్యములోనికి నడిపించి సంభవింపబోవునవి తెలియజేస్తాడు. (యోహాను 16:13)

v ఆయన పిల్లలమైన మనముపరిశుద్ధాత్మతో సరియైన సహవాసము కలిగి ఉండాలనేదే దేవుని చిత్తము అయిఉన్నది

v పరిశుద్ధాత్మతోసరియైన సన్నిహిత సంబంధము లేకుంటే శక్తిగల కార్యాలను, అద్భుతాలను చూడడం అసాధ్యం

v మనము దేవునివాక్యాన్ని ధ్యానించుచు సరియైన మార్గములో నడిపింపబడుట వలన క్రీస్తుకు సాక్షిగాజీవించాలన్నదే పరిశుద్ధాత్మ ఉన్నతమైన ఉద్దేశ్యము

v పరిపూర్ణ సమర్పణకలిగిన జీవితములో దేవునితో చెలిమి చేసినపుడే ఆయన మనలను అభిషేకిస్తాడు.

v  ఆత్మసంబంధమైన కార్యాలను చేయుటలో పరిశుద్ధాత్మునిసహాయము నీకు తప్పక ఉంటుంది.

 

ప్రార్థనయందు ఐక్యత

     యేసు ఇతరులతో కలిసి ప్రార్థించెను.

     రూపాంతరమందు (లూకా 9:28,29)

     గెత్సెమనే వనములో (మత్తయి 26:36,38)

 

ఆది సంఘము ఏకమనస్సుతో ప్రార్థించెను

     దేవాలయములో ఎడతెగక ప్రార్థించిరి (లూకా24:52,53)

     మేడగదిలో అందరూ కలిసి ప్రార్థించిరి(అ.కా. 1:14)

     పెంతెకోస్తు దినమున ఒకేచోట ఉండిరి(అ.కా. 2:1-4)

     పేతురు, యోహానులు ప్రార్థనకు కలిసివెళ్ళిరి (అ.కా.3:1)

     వారు ఏకమనస్సుతో దేవునికి బిగ్గరగామొర్రపెట్టిరి (అ.కా. 4:23,24)

     అనేకులు కూడి ప్రార్థన చేసిరి (అ.కా.12:12)

     పౌలును, సీలయు కలిసి ప్రార్థించిరి(అ.కా. 16:25)

 

కలిసి ప్రార్థించువారికి ఇవ్వబడిన వాగ్ధానములు

     ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడియుందురోక్రీస్తు అక్కడ ఉండును (మత్తయి 18:20)

     తాము వేడుకొను సంగతిని గూర్చి ఏకీభవించినఅది జరుగును (మత్తయి 18:19)

 

      పరిశుద్ధాత్మతో నింపబడిగొప్ప ప్రార్థనాపరులముగా ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు తీర్మానంచేసుకుందాం. ఎల్లప్పుడూ ప్రార్థనకు ప్రథమస్థానం ఇచ్చి దేవుడిచ్చే సర్వోత్కృష్టపలితాలను అనుభవించి ఫలభరిత జీవితం జీవించునట్లు సర్వోన్నతుడైన దేవుడుప్రార్థనాజీవితం నీకనుగ్రహించి సర్వసమృద్ధిలోనికి నిన్ను నడిపించును గాక. ఆమెన్!!!

ఉపయుక్త గ్రంధములు:

1.      కల్వరి ప్రేమధార(ఆధ్యాత్మిక ద్విమాస పత్రికలు) డా. ఎన్‌. జయపాల్‌

2.      విజయవంతమైనక్రైస్తవ జీవితానికి అత్యవసరమైన పునాదిరాళ్ళు – బిషప్‌ డార్లింగ్‌స్టన్‌.జి.జాన్సన్‌

3.      కాపరి దుడ్డుకర్ర

4.      దెబోరాస్వరం – జాయ్‌చెరియన్‌

5.      ఎడారిలో సెలయేర్లు- చార్లెస్‌కౌమన్‌

6.      కాపరి క్రైస్తవనాయకత్వ మాసపత్రిక – శ్రీమతి మరియమ్మ కిశోర్

            ప్రభువైన యేసుక్రీస్తునామమున వందనములు. ఈ పుస్తకం ప్రతిఒక్కరినీ విశ్వాసములో పురికొల్పుతూ, గొప్ప ప్రార్థనాయోధులుగావిజయవంతమైన ఆత్మీయజీవితం కలిగి ఉండాలనే ఆశతో వ్రాయబడింది. కేవలం ఆత్మీయఉజ్జీవంకొరకు మాత్రమే  ఉద్ధేశింపబడింది. ఈపుస్తక రచనకు సహకరించిన పై పుస్తక రచయితలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాను.  

 Dr. S. CHANDRA KIRAN

S. MANJULA RANI

 

 


Categories: INSPIRIED MESSAGES

Post a Comment

Oops!

Oops, you forgot something.

Oops!

The words you entered did not match the given text. Please try again.

Already a member? Sign In

0 Comments