|
|
ప్రార్థన
క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి వంటిది. ప్రార్థన లేకుండా క్రైస్తవునిగాజీవించలేమని మనకు తెలుసు. వ్యక్తిగత జీవిత భౌతిక, ఆత్మీయ అభివృద్ధికి, సంఘఅభివృద్ధికి, ఆత్మల రక్షణకు, ఉజ్జీవమునకు అన్నిటికీ ప్రార్థనే ఆధారం. ప్రపంచంలోఉజ్జీవాలన్నీ ప్రార్థన ద్వారానే వచ్చాయి. గొప్ప దైవజనుల విజయ రహస్యం ప్రార్థనే.ప్రార్థనకు ఇంత ప్రాముఖ్యత ఉన్నదని తెలుసుకున్నను అనేకమంది క్రైస్తవులు ప్రార్థనలకొరకు ఎన్నో తీర్మానములు చేసుకున్నను శరీర బలహీనతను, మత్తును జయించలేక తగినంతగాప్రార్థించలేకపోతున్నారు. ఎందుకనగా సొంతశక్తితో ఎవరూ సంపూర్ణమైన ప్రార్థనచేయలేరు.
ప్రార్థన అంటే :
Ø ప్రార్థన అంటేదేవునితో సంభాషించుట, అనగా దేవునితో మాట్లాడుట, దేవుని మాట వినుట. నిజమైన ప్రార్థనఅంటే “మానవాత్మ పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని కృపాసనం వద్దకు వెళ్ళడం” అన్నారు చార్లెస్ స్పర్జన్
Ø మాటల్లోనూ,మౌనంలోనూ వ్యక్తమయ్యే ఆత్మలోని తృష్ణే ప్రార్థన. నివురు గప్పిననిప్పులా ఉంటూ నిత్యం దహింపజేసేదిప్రార్థన
Ø ప్రార్థన ఒకహృదయాభిలాష, అది భాష కందనిది,గుండెలను కదిలించే అజ్ఞాత అగ్నిజ్వాల
Ø మన పాపాలనుఅంగీకరిస్తూ, దేవుని కనికరానికి ఆయనకుకృతజ్ఞత తెలపడం. అంతేకాదు; క్రీస్తు నామంలో మన అవసరాలను దేవునికి తెలిపి వాటినిఆయన చిత్తానికి యోగ్యంగా ఉండేలా వాటిని ఆయనకు సమర్పించడం ప్రార్థన
Ø ప్రార్థన అంటేదేవున్ని బలవంతంగా మార్చే ప్రయత్నం కాదు. ఆయన చిత్తానికి అనుకూలంగా మనల్ని మనంఅంకితం చేయడమే
Ø ప్రార్థన దేవున్నితెలుసుకోవడానికి మనకు తోడ్పడుతుంది
Ø ప్రార్థన మనందేవునితో మాట్లాడటానికి, మనసు విప్పి ఆయనతో సంభాషించటానికి, మన ఆత్మలోనిఆరాటాన్ని తెలిపి ఆయనలో లీనం కావడానికి దోహదం చేస్తుంది.
Ø మోకరించే క్రైస్తవుడు ఆయన్ని కనుక్కోగలుగుతున్నాడు: అదేసమయంలో దేవుడు అతన్ని కనుగొంటున్నాడు.
Ø ప్రార్థన ద్వారా మనఆత్మ దైవ సన్నిధిలో సన్నిహితత్వం పొందుతుంది.
Ø దేవున్నిదర్శించడమే ప్రార్థన. దైవ దర్శనం లేనిప్రార్థన వ్యర్థం.
Ø మన అవసరాలనుదేవునికి తెలపడం ప్రార్థనలోని ప్రాముఖ్య అంశం
Ø ఆయనలో గాఢంగా కలిసిపోవడమే నిజమైన ప్రార్థన.
Ø హృదయమంతటితో,బలమంతటితో ప్రార్థించడం క్రైస్తవులు ఈ భూమిపై సాధించగలిగిన అంతిమ మహా విజయం .
Ø పరిశుద్ధాత్ముడుప్రార్థనలో మనకు సహాయకుడు.
Ø ప్రార్థన మనకున్నఆధిక్యతలన్నిటిలోకి అత్యున్నతమైనది.
Ø మనబాధ్యతలన్నిటిలోకి అతి గంభీరమైనది. మన చేతుల్లో పెట్టిన మహోన్నత శక్తి ప్రార్థన.
Ø దేవుని ధననిధితలుపు తెరిచే తాళం చెవి ప్రార్థనే.
మనము ఎవరికి ప్రార్థన చేయాలి?
మనము యేసునామములో తండ్రి యైన దేవునికి ప్రార్ధన చేయవలెను (యోహను 14:13, 14:16,23, యాకోబు1:5) మరియమ్మకు గానీ, పరిశుద్ధుకు గానీ, విగ్రహములకు గానీ ప్రార్థించకూడదు.
మనము ఎందుకు ప్రార్థన చేయాలి?
మనము దేవుని సహవాసము కొరకు
పరిశుద్ధముగా జీవించుట కొరకు,
పాపక్షమాపణ కొరకు,
మన అవసరతల కొరకు,
పాపములో పడకుండా దేవుని కృపను పొందుట కొరకు
ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి
మనము ప్రార్థన ఎలా చేయాలి ?
విశ్వాసముతో, పట్టుదలతో (యాకోబు 1:5,6)
విరిగి నలిగిన శుద్ధ హృదయముతో (కీర్తన 51:17; 68:18)
పరిశుద్ధాత్మలో ప్రార్థించండి (యూదా 21)
మనము ఏ సమయంలో ప్రార్థన చేయాలి?
వేకువ జామున (మార్కు 1:35)
మద్యాహ్నము (అపొ.కార్య.3:1 10:9
రాత్రివేళ (లూకా 6:12)
భోజనముచేయునపుడు(యోహాను6:11)
శ్రమలకా లములో (యాకోబు 5:13
ఆపత్కాలములో (కీర్తనలు 50:15)
అనారోగ్యములో (యాకోబు 5:14)
నిత్యము ప్రార్థన చేయవలెను(లూకా 18:1)
మనము ఎప్పుడు ప్రార్థన చేయాలి?
మనో విచారములో ఉన్నపుడు -యోహాను 14
మనుషులు మోసగించినపుడు -కీర్తన 27
ఫలభరితమైన జీవితం కొరకు -యోహాను 15
పాపము చేసినపుడు -కీర్తన 51
ఆందోళనకు లోనైనపుడు -మత్తయి 6: 19-34
అపాయము ఉన్నపుడు -కీర్తన 91
దేవుడు లేడు అనుకున్నపుడు -కీర్తన 139
విశ్వసము సడలినపుడు -హెబ్రీ 11
ఒంటరితనంతో భయభ్రాంతులయినపుడు - కీర్తన 23
చేదైనఅనుభవాలతో క్లిష్ట పరిస్థితులలో ఉన్నపుడు – 1 కొరింథి 13
సంతోషకరమైన హృదయం కొరకు – కొలస్సీ 3:12 - 17
క్రైస్తవ్యమును సరిగా అర్థంచేసుకొనుటకు - 2 కొరింథి 5: 15-19
నిరాశలో ఉన్నపుడు – రోమా 8:31
శాంతి, సమాధానముల కొరకు మత్తయి11:25-30
ప్రపంచం దేవునికంటే పెద్దదిగా కనిపించినపుడు కీర్తన 90
క్రీస్తునందు గట్టి నమ్మకం కొరకు - రోమా 8:1-30
నీ ప్రార్థన స్వార్థపూరితమైనపుడు - కీర్తన 67
పనిలో ధైర్యం కొరకు – యెహోషువ 1
సహచరునితో సహవాసం కొరకు – రోమా 12
నిరుత్సాహంలో ఉన్నపుడు -కీర్తన 27
పేదరికంలో ఉన్నపుడు – కీర్న 37
ప్రేమ లోపించినపుడు – 1కొరింథి 13
దయ లోపించినపుడు -యోహాను 15
పనిలో నిరుత్సాహపడినపుడు – కీర్తన 126
భయములో ఉన్నపుడు – కీర్తన 34:7
దేవుడు నీకు తోడై ఉన్నాడన్న నిశ్చయత కొరకు – కీర్తన 145:18
పరిశుద్ధమైన జీవితం కొరకు -
మనము ఎక్కడ ప్రార్థన చేయాలి?
ఒంటరిగా గదిలో లేక ఏకాంతముగా (మత్తయి 6.6; యెహెజ్కేలు 3:22)
ఇంటిలో (అపొ. కార్య. 12:12)
మందిరములో(అపొ.కార్య 4:31)
గుంపులో మనము ప్రార్దన చేయాలి (అపొ.కార్య. 1:14)
ప్రార్థనలో అడుగుట:
ü దేవునిజ్ఞానాన్నిబట్టి అడగాలి మత్తయి 6:8
ü దేవునిఅంగీకారాన్నిబట్టి అడగాలి లూకా 11:11-13
ü దేవుని ప్రేమనుబట్టి అడగాలి యోహాను 16:23-27
ü క్రీస్తునందునిలిచి అడగాలి యోహాను 15:7
ü విశ్వాసంతో అడగాలి యాకోబు 1:5,6
ü ఆజ్ఞలు పాటిస్తూఅడగాలి 1 యోహాను 3:22
ü దేవునిచిత్తానుసారంగా అడగాలి 1 యోహాను 3:22
ü గట్టి నమ్మకంతోఅడగాలి మత్తయి 21:22
ü నిస్వార్థంగాఅడగాలి యాకోబు 4:2,3
ü క్రీస్తు నామంలోఅడగాలి యోహాను 15:16
మనము ప్రార్థన ఎంతవరకు చేయాలి?
మనము మన ప్రార్దనకు జవాబు వచ్చునంత వరకు ప్రార్దన చేయాలి. ఎంత సమయము ప్రార్దించామన్నది ముఖ్యం కాదు గాని, ఎంత ఆసక్తితో ప్రార్దించామన్నదే ముఖ్యము
మనము చేసే ప్రార్థనలన్నిటికీజవాబు వస్తుందా?
మనము చేసిన ప్రతి ప్రార్దనకు జవాబు వచ్చును
అయితే అవును – వద్దు –కనిపెట్టు అను జవాబులలోఏదో ఒకటి వచ్చును. దావీదు అమాలేకీ యులను తరిమిన యెడల వారిని కలిసికొందునా? అని అడిగినప్పుడు దేవుడు తరుము నీ వారిని దక్కించుకొందువనెను (1సమూయేలు 30:8)
బిలాము బాలాకు రాజు పిలుపును అంగీకరించి శ్రాయేలీయులను శపించుటకు వెళ్ళుదును అన్నప్పుడు దేవుడు వద్దు అనెను (సంఖ్యా 22:10-12)
అబ్రాహాము తన సంతానమును గురించి వాగ్దానము పొందినప్పటికి దాని నెరవేర్పుకొరకు కనిపెట్టవలసి వచ్చెను (ఆది 15:4; 21: 1,2)
మన ప్రార్థనలో ఏమి ఉండాలి?
మోకాళ్ళూని, కన్నులు మూసికొని చెడ్డసంగతులు గాని మంచి సంగతులుగాని తలంపక క్రీస్తు ప్రభువునే తలంచుకొనవలెను. (యోబు11:13, కీర్తన 57:7, హెబ్రి 12:2)
మన పాపములు, బలహీనతలు ఒప్పుకొనుట ఉండాలి. తలంపులోను, మాటలోను క్రియలోను గలపాపములను ఒప్పుకోవాలి. (కీర్తన 32:5, యోహాను 1:9
నాకు తెలిసిన పాపములు ఇకమీదటచేయకుండుటకు ప్రయత్నము చేసెదనని చెప్పాలి (కీర్తన 119:112, నెహెమ్యా 10:29,32)
నాకు కలిగియున్న శరీరమును, ప్రాణమును,ఆత్మను, నా సమస్తమును నీ స్వాధీనము చేయుచున్నానని చెప్పవలెను (ఆది 22:2, రోమా 12)
స్తుతి, కృత జ్ఞతలు చెల్లించుట ఉండాలి, క్రీస్తు ప్రభువు తొలగించని కష్టములను, తొలగించిన కష్టములను,ప్రభువు చేసిన మేళ్ళను తలంచుకొని ఆయనను స్తుతించవలెను. ఆయన దివ్య లక్షణములను తలంచిస్తుతించవలెను (కీర్తన 107:2, 19-21, ప్రకటన 15:3,4)
మన అవసరతలు కోరికలన్నియు చెప్పుకొనిఅడగవలసినవన్నియు అడగవలెను. (యోహాను 14:14, యెషయా 65:24)
ఇతరులకొరకు విజ్ఞాపన చేయుట ఉండాలి
ఆపై దేవుని ఆత్మ నడిపింపు ననుసరించి అనేక విషయముల కొరకు మనముప్రార్థించాలి
జవాబు కొరకు కనిపెట్టవలెను. కీర్తన37:7, యెషయ 40:31
మనము ప్రార్థించుట వలన ఫలితమేమి?
ప్రార్దన ద్వారా మనము దేవుని స్వరమును వినగలము
మన హృదయము దేవుని హృదయముతో కలియును
మన శారీరక, మానసిక ఆద్యాత్మిక అవసరతలు తీరును
మన పాపములు క్షమింపబడును
ఆధ్యాత్మిక బలము పొందెదము
సాతాను శోధనలను జయించగలిగెదము
దేవుని చిత్తమును తెలుసుకొన గలుగుదుము (యెహోను 8:29)
ఆధ్యాత్మికమర్మములను గూఢమైన సంగతులను గ్రహించుకో గలుగుదుము (యిర్మీయా 33:3)
దేవునితో సహవాసము కలిగి ఆయనతో నడిచే అనుభవాన్ని పొంద గలుగుదుము.
దురాత్మలప్రభావము నుండి విడిపించబడుదుము
దేవుని అద్భత కార్యములు స్వస్ధతలు చూచెదము
దేవుని వాగ్దానములను సంపాదించుకొని ఆదరణ పొందుదుము
ప్రార్దన వలన రూపాంతర అనుభవాన్ని పొంది పరిశుద్ధపరచబడుదుము
ప్రార్థిస్తే ఎంతటి గొప్ప సమస్యనైనా దేవుడు పరిష్కరిస్తాడు.
ప్రార్థన వలన క్రమము, మర్యాద, చురుకుదనము, శుద్ధి, విశ్వాసము, ధైర్యము,పవిత్రత, ఐక్యత, ప్రేమ, నీతి, భక్తి,అలవడతాయి.
మన ప్రార్థనా జీవితమునకు ఆటంకములు ఏవి?
పాపము: మన పాపములను ఒప్పుకోవాలి. (కీర్తన 66:1, యోహాను 1:8,9)
అవిశ్వాసము: మనము విస్వాసము పొందుటకు దేవుని వాక్యమును వినాలి, చదవాలి, ధ్యానించాలి.యాకోబు 1:6, రోమా 10: 14-17
గర్వము: మనలను మనముతగ్గించుకోవాలి. 1 పేతురు 5:5,6
స్వార్థము: మనము స్వార్థమువిడిచి , దేవుని చిత్తములో ప్రార్థించాలి. యాకోబు 43:3
విస్తారమైన పని : ప్రతి దినము ఒకప్రత్యేకమైన స్థలములో ప్రత్యేకమైన సమయమును దేవుని సన్నిధిలో గడపటానికి నిర్ణయించాలి లూకా 10:41
సోమరితనము : వేకువజామున నిద్రలేచి ప్రార్థించాలి . యోనా 1:6, సామెతలు 6:6, మార్కు 1: 35
తోటివారితో సరిగా లేకపోవడం: మన హృదయమును సరిచేసుకోవాలి మత్తయి: 5:23,24
నిద్రమత్తు: భయ భక్తులతో మెకాళ్ళమీద నిలబడి చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రార్ధించినచో నిద్రమత్తును జయించగలము (1 తిమోతి 2:8)
చెదరిన తలంపులు: మనసులోనే ప్రార్ధించినపుడు మన తలంపులు చెదరి పోవడానికి అవకాశమున్నది కాని బగ్గరగా ప్రార్ధంచినచో మన ప్రార్ధింనను మనము వింటాము కాబట్టి మన తలంపులు చెదరిపోవడానికి అవకాశము లేదు
ఆటంకములు: ఆటంకములను జయించుటకు ఒక ప్రత్యేకమైన సమయం ఒక ఏకాంత స్ధలము నిర్ణయించుకొని ఆ స్ధలంలో ఆ సమయమునందు మనమున్నప్పుడు ఇతరులు మనము ప్రార్ధనలో యున్నామని గ్రహిస్తారు గనుక నీవు ప్రార్ధన చేయునపుడు నీ గదిలోనికి వెళ్లి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్ధన చేయుము (మత్తయి 6: 6)
ఉపవాసము అనగా ఏమిటి:
‘ఉ’ అంటే ఉపేక్షంచుకొనుట;
‘ప’ అంటే పరీక్షించుకొనుట;
‘వా’ అంటే వాక్యము ధ్యానించుట;
‘స’ అంటే సమర్పించుకొనుట;
‘ము’ అంటే ముక్తిని చేరుట అని ఒకరన్నారు!
ఉపవాసము ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ!
మనం ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలి?
ఉపవాసముండి ప్రార్ధించుట ద్వారా పరిశుద్ధాత్ముడు మన జీవితాలను రూపాంత రీకరిస్తాడు ఉపవాస ప్రార్ధన ఉజ్జీవానికి మూలము! ఉపవాస ప్రార్ధన మన జీవితాలకు, సంఘాలకు, సమాజాలకు కూడా స్వస్ధత చేకూరుస్తుంది. ఉపవాస ప్రార్ధన శక్తినిస్తుంది. పునరుజ్జీవాన్ని కలుగజేస్తుంది. దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొనుటే నిజమైన ఉపవాసము! (కీర్తన 35:13 ; ఎజ్రా 8:21)
బైబిలులో ఉపవాసప్రార్థన చేసినవారు ఎవరు?
ఇశ్రాయేలీయులు (న్యాయాధి 20:26;1సమూయేలు 7:5,6)
దావీదు (llసమూయేలు 3:35 ; కీర్తనలు 35:13; 69:10;109:24)
అహాబు (1 రాజులు 21:27 – 29)
ఎజ్రా (ఎజ్రా 8:21 – 23)
నెహెమ్యా (నెహెమ్యా 1:4)
యూదావారు (నెహెమ్యా 9: 1-37)
ఎస్తేరు, మొర్దెకై (ఎస్తేరు 4: 1 – 16)
దానియేలు (దానియేలు 9: 1-3)
నీనెవెవారు
Categories: INSPIRIED MESSAGES
The words you entered did not match the given text. Please try again.

Oops!
Oops, you forgot something.