|
|
ప్రేమస్వరం
ముందుమాట
ప్రేమస్వరం అనుఈ ఆధ్యాత్మిక మాసపత్రిక సంఘమును ప్రభువురాకడకు సిద్ధపరచాలనే సంకల్పంతో ప్రేమ స్వరూప్ మినస్ట్రీస్ ద్వారా ప్రతి నెలప్రచురించబడు చున్నది. ఈ దినములలో ఆత్మ సంఘములకు ఏమిసెలవిచ్చుచున్నారో దానికి ప్రవాహకులముగా మేము ఉండగోరుచున్నాము. అంత్యదినములలో దేవుడు తన ఆత్మను ప్రపంచ మంతటి మీదకుమ్మరించి తన సంఘమును తన కుమారునిలో పరిపూర్ణముగా చేయగోరుచున్నాడు. ఈ పత్రికద్వారా పరిశుద్దాత్మ యొక్క పూర్ణ కార్యములను వివరించుచూ క్రీస్తును చూపించప్రయత్నంచుచున్నాము. ఈ దినములలో దేవుడు తన సంఘమును సత్య నిర్లక్ష్యతనుండి తప్పించి తిరిగి ఆ మొదటి శక్తితో నింపగోరుచున్నాడనినమ్ముచున్నాము. మనలోకొందరు ‘పైకి భక్తి గల వారి వలెఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు’ (2తిమోతి 3:5)ఒకవిశ్వాసిలో నుండి ప్రార్థనాశక్తి, దేవుని మహిమ, పరిశుద్ధాత్మప్రభావము ప్రవహించకపోతే వారి భక్తి వ్యర్థమే, ప్రార్థించేవారు పాపము చేయలేరు, పాపములోఉన్నవారు ప్రార్థన చేయలేరు. ప్రార్థనద్వారా మనం ఉన్నతమైన ఆత్మీయ అనుభవం లోనికి నడిపించ బడతాం, ఆత్మీయ పరిపక్వత కలిగి, దేవుడిచ్చిననూతన బలముతో అలయక, సొమ్మసిల్లక ముందుకుసాగిపోతూ, ఆత్మ ఫలములు ఫలిస్తూ, కృపావరములతో నింపబడి దేవుని మహిమ కొరకు మాత్రమే జీవిస్తూ, రాకడకుసిద్ధపడుతూ, అనేక మందిని సిద్ధపరుస్తూ, ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగాఉండాలనేది నీ యెడల దేవుని చిత్తమై ఉన్నది. తన మహిమగల సంఘము నిమిత్తము ప్రభువు వచ్చు చున్నాడు. రాకడ కొరకుసిద్ధపడుటకు ప్రార్థించండి. ఈ పత్రికను ప్రతి ఒక్కరు చదివి ఆత్మీయఆశీర్వాదములు పొందవలెనని ప్రభువు నందు మా ముఖ్య లక్ష్యమై యున్నది.
మన వ్యక్తిగత సాక్ష్యమును కాపాడుకుంటూ, దేవుడుమనలను పిలిచిన పిలుపుకు తగినట్టు జీవిస్తూ, ఇతరులకు మార్గదర్శకంగా ఉందాం. మన ప్రవర్తనవలన దేవుడు మాత్రమే మహిమ పరచబడాలి. హల్లెలూయ !!!
మీ బంధువులు, మీ ఇరుగు పొరుగువారు, మీగ్రామస్తులు, మీ నాయకుల కొరకు ఎడతెగక ప్రార్థించండి. అడుగుడి మీకు ఇవ్వబడును అనివాగ్ధానము చేసిన ప్రభువు మన ప్రార్థన ఆలకించి మన గ్రామానికి రక్షణానందమునుఅనుగ్రహిస్తాడు. దయచేసి మీ ప్రార్థన అవసరతలను ఉత్తరాలద్వారా గాని, ఇ మెయిల్‌ద్వారా గాని, ఫోన్ ద్వారా గాని తెలియజేయండి. మీ కొరకు ప్రత్యేకముగాప్రార్థించడానికి పరిశుద్ధాత్మచే అభిషేకింపబడిన ప్రార్థనా యోధులు ఎల్లపుడూసిద్ధముగా ఉన్నారు. రండి ! అందరం కలిసి దేవుని రాజ్యాన్ని ఆయన మహిమ కొరకునిర్మిద్ధాం !!!
దైవాశీర్వాదములు మీపై సమృద్ధిగా కుమ్మరింపబడును గాక ! ఆమెన్. ప్రేమతో … ప్రభువునందు మీ – డా. యస్. చంద్రకిరణ్ PhD
సంపాదకులు : శ్రీమతి. యస్. మంజు కిరణ్ MBA
గౌరవ సంపాదకులు : రెవ. డా. జి. విశ్వనాధం పాల్ PhD
.
ఎడిటోరియల్ బోర్డు
బ్రదర్. జి. విజయ్‌కుమార్ MCA బ్రదర్ ఎన్. చిట్టిబాబు MBA, B. Ed
శ్రీమతి యస్. మార్తమ్మ శ్రీమతి మార్గరెట్ పాల్ M.AB. Ed
కుమారి శాంతిస్వరూప M. Tech శ్రీమతిబ్యూలా విక్టర్ M.A
బ్రదర్ వై. థామస్ B.A బ్రదర్ టి. శ్రీనివాస్ పాల్ B.COM
V MAY GOD BLESS YOU LIKE NEVER BEFORE V
Categories: INSPIRIED MESSAGES
The words you entered did not match the given text. Please try again.
Oops!
Oops, you forgot something.