PREMSWAROOP MINISTRIES



A MINISTRY OF GOD'S LOVE AND CARE



"When you give a banquet, invite the poor, the crippled, the lame and the blind and you will be Blessed"

Dr.S.CHANDRA KIRAN
Smt.S.MANJU KIRAN

Home Post New Entry

view:  full / summary

DISCIPLESHIP TRAINING

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on October 19, 2012 at 12:55 AM Comments comments (0)

                                        Basic disciplines of the Christian life.

Level 1- The Disciplined Christian, The Daily Quiet Time, Memorizing God's Word, My Relationship With Christ, Effective Praying, Studying God's Word, Witnessing in My Sphere of Influence, Practical Disciplines, Check-up and Evaluation

Level 2- The Bible: An Overview, Discovering Your Spiritual Gifts Romans 12:6-8, Developing Your Spiritual Gifts, My Commitment To My Church, The Ministry of the Holy Spirit, Dealing With Temptation, Disciplining the Mind, The Lordship of Christ, Check-up and Evaluation

Level 3- Accepting Ourselves As God Created Us, How To Give a Testimony, Personal Problem Solving, Knowing God's Will, Resolving Interpersonal Conflict, The Fruit of the Spirit, Distinguishing Good From Evil, Setting Priorities, Check-up and Evaluation,

Level 4- Setting Your Own Goals, Digging Deeper: The Daily Quiet Time, Digging Deeper: Effective Praying, Digging Deeper: Witnessing in My Sphere of Influence, Digging Deeper: Exercising My Spiritual Gifts, The Discipline of Fasting, The Three "R's" of Discipleship, Christian Maturity, Check-up and Evaluation



Pray for This Kid

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on September 17, 2012 at 4:25 AM Comments comments (0)

Dear belobed in Christ

Rajesh 13 year old boy suffering with HIV. last year his parents are died now he is staying his poor grandmother in Punganur. please pray for him. 


Prayer Tower

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on September 12, 2012 at 4:40 AM Comments comments (3)

Dearbeloved in Christ

Greetingsto you in the matchless name of Jesus Christ

TheAlmighty God spoke to me to establish a Prayer Tower in Punganur, which is aplace of solace and comfort to lots of people who are in agony, sickness andtears and to wipe away the tears of the broken hearted through the prayersoffered in the Prayer Tower. By the grace of God and in obedience to His voicePSM Prayer Tower was established in Punganur, Chittoor District, AndhraPradesh, India on the 03rd of September 2010.

The brokenhearted call or visit the Prayer Tower seeking prayers and divine counsel. ThePrayer Intercessors and counselors listen with empathy and fervently pray forGod’s deliverance and blessing to come upon their lives. God hears the prayersand miracles, healing and deliverance happen in the lives of such people. PSMPrayer Tower is to comfort the broken hearted through the love and compassionof Jesus Christ. Who come seeking for God’s blessing and deliverance in theirlives.

The Prayerintercessors pray for the people in our 24/7 Prayer Tower 365 days in a year tointercede for the broken hearted. All our services are offered free of cost toeveryone who calls or visits the Prayer Tower.

Theoperations of the Prayer is sustained by the offering and donations sent bysome of our well wishers and donors. Your sacrificial offerings and prayerswill help us to reach more and more souls every day. We are praying for PrayerTower Building in Punganur , please Pray and participate to win this land forJesus and for His glory. Amen

God BlessYou

Yours inHis service

Dr. S. ChandraKiran

Our otherservices for the glory of God the Almighty.

1.     ChurchMinistry

a.      Preach the Good news to the Poor and the Lost

b.     Hosting conferences, Seminars, Revivals and Prayerrallies

c.      Street preaching

d.     Distributing tracts

e.      Personal Evangelism

f.       Door to door visiting

g.      Visiting Schools and Colleges and distribute the NewTestament Bibles and Tracts

h.      Zeep ministry (with rented zeep we can cover 20villages with gospel per month

i.        Conducting small village meeting with the help of localleaders

j.       Using megaphones in forest and fields

k.     Mass Evangelism

2.     BibleSchool

PSM-IVBI BIBLE SCHOOL,Affiliated to IVBI (International Victory Bible Institutes) Tulsa, Oklahoma,USA. Through this Bible School 30 students are graduated and sent for thefields to win this land for Jesus. Our vision is to Transform people byTraining, Mentoring and Empowerment and to Change the lives through God’s wordand the power of Prayer.

3.   Children Home Oldage Home

Give the poor and needy not just ahand-out but a hand up

We are helping 6children and 5 old people. This home is sustained by the offering and donationssent by some of our well wishers and donors. Your sacrificial offerings andprayers will help us to reach more and more souls.

 May God Richly Bless You

Dr. S. Chandra Kiran & Manju Kiran

 

Prayer

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on August 31, 2012 at 4:55 AM Comments comments (0)

A birthday prayer for my mother

Dear heavenly Father I thank you for my loving mother.I thank you for all the things she has done and given me. I pray her day is filled with good things and happy moments—not only today but everyday.

Lord,put a smile on her face and let her bring cheer to those she meet;let her shine your love.

I thank you for your promises for her life.Thank you that you are her rock,her fortress,her deliver,

her healer,her shield and her strength.Thank you that she has the mind of Christ and that she is filled with Your love,peace,joy and strength every day.

Thank You that You are with her and You promise

to always take care of her.

Mom I say to you that:

God rejoices in your life.

He believes in you…

watches over you…

and tenderly keeps you in His constant care.

You are valued and loved!

May God reveal His many blessings He has in store for you

in the beginning of this another year!

Lord I come to you. Thank you that you are the source of my fulfillment and the answer for my every need. Thank you that you will give me strength for today and teach me how to walk with You.

we love you so much

Son

Chandra&Family

PSM CHILDREN HOME

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on May 28, 2011 at 2:00 AM Comments comments (0)

Name SANDHYA RANI SUNNAPURALLA

Gender F

DOB (mm/dd/yyyy)        16/06/2000

Age (Yrs) 11

City PUNGANUR, CHITTOOR Dt.

State ANDHRA PRADESH

About Sandhya:

Sandhya 11 years old girl student studying in class VII in Municipal High School, Punganur. She is good at studies and likes mathematics. She is has one Brother Nithin . She likes drawing and her favorite game is Cho-cho . she wants to become a Doctor.  Her father-Ramesh died in the year 2010, and her mother-Sujatha is working as a coolie in poultry form.. The whole family depend upon her income and it is not sufficient to meet their daily needs. They live in a single rented room without any facilities. her mother is not able to give any support for her studies. she is in our home. 

Father's Name S. Ramesh (Late)

Mother's Name S. Sujatha

Mother's Occupation Coolie

Annual Family Income (Rs) 6000/-

Necessities/ Break-up

Feeding expenses (Rs.1000 per month) Study materials (Rs.1500) school uniforms 3 sets with shoe (Rs.1500)  Medical care (500)

Amount required (Rs) 6000

Amount Raised (Rs) 2 000

Amount Remaining (Rs)              4000

Education completed VIII

Hobbies Dancing and interested in Paintings

Year 2012 - 2013


PRAY&PARTICIPATE

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on May 18, 2011 at 3:25 AM Comments comments (0)

ప్రేమస్వరూపిప్రార్థన మందిరం

ప్రేమాస్వరూపుడైన దేవుడు మన ప్రార్థనలకు జవాబుగా పరిశుద్ధమందిర నిర్మాణము కొరకు స్థలమును దయచేశాడు. “ఈ స్థలమందు చేయబడుప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును.

నాపేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధ పరచితిని, నాదృష్టియు,నా మనస్సును నిత్యము దానిమీదనుండును”. (2 దిన .7:15,16) అని సర్వోన్నతుడైనదేవునిచే వాగ్దానము పొంది ఆయన మహిమార్థమై నిర్మించబడుచున్న  ఈ మందిర నిర్మాణము కొరకు ప్రార్థించి, సహకరించిదేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులై సకలాశీర్వాదాలతో నింపబడాలని  ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఈప్రార్థన మందిరం నిరాశలో ఉన్నవారికి ఆశ్రయపురం

 

 

CHRISTIANS FOR CHRIST

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on May 18, 2011 at 3:19 AM Comments comments (0)

CHRISTIANS FOR CHRIST

ఈనాడు మనం క్రీస్తు కొరకు ఏమి చేస్తున్నాము అని ఆలోచిస్తే అందరూ మన స్వార్థముకొరకు మాత్రమే అలోచిస్తూ, మన సొంత పనులను చక్కబెట్టుకొనుటలో బిజీ అయిపోతున్నాముకాని మనలను తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించిన   క్రీస్తు కొరకు, అయన ప్రేమరాజ్య స్థాపనకు ఎవరమూఎక్కువగా అలోచించటం లేదు. ఆలోచన వచ్చినా మన శరీరకార్యములకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూదేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మరచిపోతున్నాము.  సంఘపునాదులు పాడైపోవుచుండగా, నిర్విచారముగాకోర్చొని నన్నేమి చేయమంటావు అనే విశ్వాసులు, సంఘ కాపరులు, సంఘ నాయకులు అనేకులనుచూస్తున్నాము. సర్వలోకమునకు సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకేనశించిపోవుచున్న ఆత్మల కొరకు విజ్ఞాపన చేద్ధాం. అప్పుడే సకల జనులకు సువార్తనుఅందించగలుగుతాం. మన బంధువులు, మన పొరుగువారు, మన గ్రామం, మన మండలం, మన జిల్లా, మనరాష్ట్రం, మన దేశంలోని ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో లబించే రక్షణానందాన్నిఅనుభవించాలని ప్రార్థన చేద్ధాం. రండి ... దేవుని రాజ్యస్థాపనలో భాగస్తులు కండి. మీగ్రామం పేరు, మీ బంధువుల పేర్లను రాసుకొని ప్రభుపాదసన్నిధిలో మొరపెడదాం. మీకొరకుప్రతిరోజు విజ్ఞాపన చేయుటకు ప్రార్థనాయోధులు మన ప్రెయర్‌ టవర్‌లో సిద్ధముగాఉన్నారు. దయచేసి మీ పేరు, చిరునమా, పోన్‌ నంబరు మరియు ప్రార్థనా మనవులను మాతోపంచుకోండి. దేవుని మహిమార్థమై ఆయన రాజ్యవ్యాప్తి కొరకు అందరం కలిసి పనిచేద్ధాం.సర్వోన్నతుని మెండైన దీవెనలు మీపై సమృద్ధిగా కుమ్మరింపబడునుగాక!!! ఆమెన్

 

Pray

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on May 18, 2011 at 3:14 AM Comments comments (0)

 

 

ప్రార్థించండి

1.      క్రైస్తవులలో, సంఘములలో ఐక్యత కొరకు

2.      క్రైస్తవ కుటుంబములలో శాంతి సమాధానముల కొరకు

3.      దేవుని సేవకులు,విశ్వాసులు ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా బలపడుట కొరకు

4.      సంఘనాయకులు, విశ్వాసులు ఆధ్యాత్మిక పరిపక్వత కలిగి ఆత్మఫలములు  ఫలించునట్లు

5.      మన పొరుగువారి రక్షణ కొరకు

6.      మన గ్రామం, మండలం, రాష్ట్రం, దేశం అభివృద్ధి కొరకు

7.      అన్ని గ్రామాలలో ప్రతిరోజు ప్రార్థనలు జరుగునట్లు

8.      ప్రతి ఒక్కరూ మారుమనస్సు పొంది దేవుని మహిమార్థమై మాత్రమే జీవించునట్లు

9.      అధికారులు, నాయకుల కొరకు

10.  దేశంలో శాంతి భద్రతల కొరకు

11.  బీదలు, విధవరాండ్రు, వృద్ధుల కొరకు

12.  వ్యాధి, బాధలతో పీడింపబడుతున్నవారి విడుదల కొరకు

13.  తాగుబోతుల వలన అనేక కుటుంబములలో కలహములు,

14.  ప్రేమస్వరూపి ప్రార్థన మందిర నిర్మాణము కొరకు

15.  ప్రేమస్వరూపి ప్రెయర్‌ గార్డెన్‌ నిర్మాణము కొరకు

16.  ప్రేమస్వరూపి ప్రెయర్‌ టవర్‌ నిర్మాణము కొరకు

17.  ప్రేమస్వరూపి చిల్డ్రన్‌, విడోస్‌, మరియు ఓల్డేజ్‌  హోమ్‌ల నిర్మాణము కొరకు

 


Rightious

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on May 18, 2011 at 2:57 AM Comments comments (0)

నీతి కొరకు ఆకలి

      మన నీతికిఆధారమైన క్రీస్తు ప్రభువు యొక్క మహిమాన్వితమైన మొదటి రాకడకాంతిలో ఆనందించుచున్న ఆనందవిశ్వాసులారా! మహిమా న్వితుడైనయేసుక్రీస్తు ఆనందకాంతిని మనందరిపై ప్రసరింపజేసి మనలను మహిమానందభరితులనుగా చేయును గాక!  ప్రభువు యొక్క పరిశుద్ధ పాదపద్మముల చెంతకూర్చుని, ఆయన రాకడ వాక్యములను ధ్యానించుచున్న మీపై త్రిత్వతండ్రి తన రాకడ మర్మములతో మనఅంతరంగములను నింపును గాక! ఆమెన్‌.

ఆకలిలేనిదే మనిషికి మనుగడ లేదు. ఆకలిరెండు రకములు. శారీరక ఆకలి (బహిరంగ ఆకలి), మరియు ఆత్మీయఆకలి (అంతరంగ ఆకలి), ప్రియులారా ! అశాశ్వతమైన ఈ లోకంలో ధనము, ఆస్తులను సమకూర్చుకోవడ ము , పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనే తపన అనేవి బహిరంగ ఆకలిగాచూడవచ్చు. ఈ లోకంలో ఎంత ధనం సంపాదించినా, ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగియున్నామానసిక ప్రశాంతత లేనిదే వాటిని మనం అనుభవించలేము. ఆ మానసిక ప్రశాంతత కొరకు సర్వోన్నతుడైన దేవుని సన్నిధిని  వెదకడం ఆత్మీయ ఆకలిగా గుర్తించవచ్చు. పాప బంధకాలతో బంధింపబడి, అంతుతెలియని రోగాలతో,మానసిక అశాంతితో రగిలిపోతున్నపుడు ఆత్మీయ ప్రశాంతత కొరకు వెదకడమే అంతరంగ ఆకలి. మరిఆ అంతరంగ ఆకలి తీరాలంటే మొదట మనం నీతిమంతులముగా తీర్చబడాలి. మానవులపై దేవుడువిధించిన అతి ప్రాముఖ్యమైన భక్తితో కూడిన అవసరత నీతిగా బ్రతకడమే.

మరి పాపములో పుట్టి, పాపములో జీవిస్తూ దేవునికిఅవిధేయుడుగా జీవిస్తున్నమానవుడు తాను చేసే మంచిపనులను బట్టి, దానధర్మాలను బట్టినీతిమంతుడనయ్యాననుకొనుచూ అపోహ పడుచున్నాడు. మన నీతి క్రియలు మురికిగుడ్డలవలె ఆయెనుఅని యెషయా ప్రవక్త చెబుతున్నాడు. మన నీతి క్రియలు, ధర్మశాస్త్ర సంబంధ క్రియలు,మరియు ఏ మానవుడూ మనలను నీతిమంతులుగా తీర్చలేరు. మరి  మానవుడు నీతిమంతుడు ఎలా కాగలడు?  దానికి ఏకైక మార్గం నీతిమంతుడైన యేసుక్రీస్తే.క్రీస్తును వెంబడించువాడు నీతిమంతుడు. అనగా ఇది కేవలం దైవకార్యం. యేసుప్రభువునునమ్ముట ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడతాడు. (గలతీ 3:6) విశ్వాసము ద్వారా(రోమా 5:1), కృప చేత (రోమా 3:24), యేసు రక్తము వలన (రోమా 5:9), యేసు నామము వలన (1కొరింథి 6:11), దేవుని ఆత్మయందు (1 కొరింథి 6:11), క్రీస్తు యేసు పునరుద్ధానమునుబట్టి (రోమా 4:25), పశ్చాత్తాపముతో పాపమును ఒప్పుకొని విడిచిపెట్టుట ద్వారా (లూకా18:14), యేసు ప్రభువు ఆజ్ఞలకు సంపూర్ణముగా విధేయులమగుట ద్వారా మనం నీతిమంతులముగాతీర్చబడుదుము. నీతిమంతులు దేవుని బిడ్డలు, వారు దేవుని విడువరు, దేవుని స్తుతిస్తారు,విడువక ప్రార్థిస్తారు దేవుని వాక్యమును నమ్మి ఆయన వాక్యంపై ఆధారపడతారు.వాక్యాన్ని విని, చదివి, ధ్యానించి, అంగీకరించి, విశ్వసించి దానిని అవలంబిస్తారు.దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు, ఆయన సన్నిధిలో జీవిస్తారు దేవుని యందు భయభక్తులుకలిగి, ఆయన మహిమార్థమై జీవించి ఆయన ఇచ్చే సకలాశీర్వాదాలను ఆనందంతో ఆస్వాదిస్తారు,

  ఆయన మనలను అణచని యెడల మనకు ఆకలి కలగదు. ఆకలి లేనియెడలఆహారమును అందుకొనలేము గనుకనే అన్నికాలములలో ఉన్న తండ్రి అందరినీ అణచుచూ, వారికికావాల్సిన పోషణ ఇచ్చుచూ బలపర్చుచూ ఉన్నారు. ఇశ్రాయేలీయులను 40సంవత్సరములుఅవిశ్రాంతముగా పరలోకపు ఆహారమిచ్చి పోషించారు. ఏదేను మొదలుకొని, నూతనయెరూషలేము వరకు ఉన్నవారిని ఆయనే వారి వారి అంతస్తులను బట్టి పోషించుచున్నాడు. ఎన్నివిధములుగా నిన్ను నలుపవలెనో అన్ని విధములుగా ఆయన నిన్ను అణచినప్పుడు, నీకుఎన్నడూ లేనంత ఆకలి కలుగుతుంది. భూమ్యాకాశములు కూడా ఆ ఆకలిని తీర్చలేవు. అంత పెద్దఆకలి నీకు కలుగుతుంది. గనుక ఆయన నిన్ను అణచినప్పుడు నీకు మొదటిగానీతికొరకు ఆకలివేయును. 

1. నీతి కొరకు ఆకలి (మత్తయి 5:6) : నీతికొరకు ఆకలిదప్పులుగలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురని మనప్రాణప్రియుడు కొండమీది ప్రసంగములో బోధించాడు. పరిశుద్ధులుగాదేవుని చెంతనుండి, క్రీస్తునుపోలి, పరిశుద్ధాత్మతోనిండి ఉండడమే నీతిమంతులుగా ఉండడము. నీతిమంతులుగా ఉండవలెనంటేపాపములను విడిచిపెట్టాలి. ఎందుకంటే పాపము దేవుని నుండి దూరము చేసి మనజీవితములో పరిశుద్ధాత్మను పనిచేయనీయదు.(ఎఫెసీ 4:30).నీతి అనగాక్రీస్తు నీతి, క్రీస్తు పరిశుద్ధత. నీతి కొరకు ఆకలి అనగా ఆయన నీతిజీవితము కొరకైన ఆకలి. నీవు ఎప్పుడైతే, ఆయనచేతిలో నలపబడతావో, అణచబడతావో అపుడు నీలోని దుర్నీతి నశించి, స్వనీతిరాలిపోయి, క్రీస్తు నీతిని ధరించుటకొరకైన ఆకలి నీలో వేగిరముగా పుట్టును. క్రీస్తుసహవాసములో తప్ప మరెక్కడా నీకు క్రీస్తు నీతి దొరకదు. గనుకక్రీస్తుతో అన్యోన్య సహవాసములోనికి వెళ్ళుటకును (యోహాను 1:7),అక్కడఆయనను చూచుటకును, ఆయన మాటలు వినుటకును, ఆమాటలలోని నీతిని ధరించుకొనుటకును నీకు ఆకలి పుట్టును. ఇదియేక్రీస్తు నీతికొరకైన ఆకలి. రెండవదిగా నీవు ఎపుడయితే ఆయన చేత అణచబడతావోఅప్పుడు నీలో ఉన్న మూర్ఖత్వము, అవిశ్వాసము రాలిపోవును గనుక నీ ప్రభువుమీదే మరింతగాఆనుకొనుటకునూ, అన్నిటికంటే నీ ప్రభువునే ఎక్కువగా నమ్ముటకును నీకు ఆకలి పుట్టును. కనుకప్రతి చిన్న పనికి, ప్రతి చిన్న కదలికలోను నీ ప్రభువు మీదఆనుకొనుటకు నీకు ఇష్టము పుట్టును. ఇట్టి అనుభవము అబ్రహాముజీవితములో ఉన్నది గనుకనే “అబ్రహాము దేవుని నమ్మెను అదిఅతనికి నీతిగా ఎంచబడెను” (యాకోబు 2:23)అనిపరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. అబ్రహాము నమ్మికే అతనిజీవితములోని నీతి. గనుక ఆయనను నమ్మియుండుటలో మనమెంత ఆకలిగొనియుందుమో అంతగా నీతిమంతులుగా తీర్చబడెదము అనగా అంతగా ఆయన నీతిచేత పోషించబడెదము, నింపబడెదము. అదేక్రీస్తు సిలువ నీతి .

2. ప్రార్థించుట కొరకు ఆకలి : (అ.కా.10:9,10) : ప్రార్థన అంటే దేవునితోసంభాషించుట, అనగా దేవునితో మాట్లాడుట, దేవుని మాట వినుట. మాటల్లోనూ,మౌనంలోనూ వ్యక్తమయ్యే ఆత్మలోని తృష్ణే ప్రార్థన.

ప్రార్థన మనం దేవునితో మాట్లాడటానికి, మనసు విప్పి ఆయనతోసంభాషించటానికి, మ‍న ఆత్మలోని ఆరాటాన్ని తెలిపి ఆయనలో లీనం కావడానికి దోహదంచేస్తుంది.  వ్యక్తిగత జీవిత భౌతిక, ఆత్మీయఅభివృద్ధికి, సంఘ అభివృద్ధికి, ఆత్మల రక్షణకు, ఉజ్జీవమునకు అన్నిటికీ ప్రార్థనేఆధారం. ప్రపంచంలో ఉజ్జీవాలన్నీ ప్రార్థన ద్వారానే వచ్చాయి. గొప్ప దైవజనుల విజయరహస్యం ప్రార్థనే.  మన జీవితంలోని ప్రతి విషయంలోనూ ఆయన చిత్తానికిలోబడి జీవించాలంటే దేవునితో సహవాసం కలిగి, ఆయనతో సంభాషిస్తూ, ఆయనతో అంటుకట్టబడిఫలభరితమైన జీవితం కొరకు ఆకలి కలిగియుండాలి. సీమోను ఇంట దిగియున్న పేతురుకుమధ్యాహ్నపు వేళ ఆకలికాగానే ఆయన ప్రార్థించుటకుపైకి వెళ్ళెను. అనగా పేతురు తన బహిరంగ ఆకలిని, అంతరంగఆకలిగా మార్చుకొన్నాడు. అనగా ప్రార్థించుటకు ఆకలిగొని, ఆశతీరాప్రార్థించాడు. ఆ ఆకలి ప్రార్థన పరలోకమును తన ముందుకుదించివేసింది. అనగా నాలుగు చెంగులు పట్టి దింపబడిన ఒక పెద్ద దుప్పటి వంటి పాత్ర ఆయన ముందుకుతేబడెను. మానవుల రక్షణకొరకైన ఆకలిగొని, సిలువపై ప్రభువు చేసిన మొదటిప్రార్థన సర్వ మానవులకు క్షమాపణను ప్రసాదించి, ఈ పెద్దదుప్పటివలె తన క్షమాపణ పాత్రలో వారిని దాచి ఉంచి కప్పివేసింది. గనుకప్రార్థనకొరకైన ఆకలి సకలాశీర్వాదములను మన ముందుకు దింపివేస్తుంది. ఓవిశ్వాసీ! ఆయన తన చిత్తములో నిన్ను అణచనిదే నీకు ఆ ప్రార్థనాకలి ఏలాగు కలుగగలదు. గనుకప్రార్థించుట కొరకైన ఆకలి కలిగి ఉండుటకు ఆత్మ తండ్రిని వేడుకొనుము 

3. వాక్యము చదువుట కొరకైన ఆకలి : (కీర్తన 119:131):‘నీ ఆజ్ఞలయందైన అధిక వాంఛచేత నేను నోరు తెరచిఒగర్చుచున్నాను’. దేవునిహృదయానుసారి అయిన దావీదు ఆయన ఆజ్ఞలు గల ధర్మ శాస్త్రము చదువుట కొరకైన అధిక వాంఛచేతనోరు తెరచి ఒగర్చుచున్నానని వ్రాయుచున్నాడు. బాగా పని చేసినవారు అలసిపోయిముందుగా దప్పిక తీర్చుకొని, ఆ తదుపరి కడుపునిండా భోజనము చేయురీతిని నీధర్మశాస్త్రమును ఆకలి దప్పికలు లేకుండా దివారాత్రులు ధ్యానించుటకు (కీర్తన 1:2)నేనుఆకలిగొనియున్నానని తెలియజేయుచున్నాడు. గనుక నరుడు రొట్టెవలన మాత్రముకాదు గానీ, దేవుని నోటినుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును. (ద్వితీ 8:3)అనివ్రాయబడిన ఈ వాక్యధ్యాన ప్రకారము ఆయన వాక్యము కొరకైన ఆకలి మాత్రమే మనిషినినిజముగా జీవింపజేయును. నిజముగా బ్రతికించును. (కీర్తన 119:50)గనుక ప్రియవిశ్వాసీ! వాక్యముకొరకైన ఈ ఆకలి నీవు కలిగి యుండగలవా? ఈ ఆకలికలిగియుండిన యెడల నీ మాటలు నాకు దొరకగా నేను భుజించితిని (యిర్మియా 15:16)అనిపలికిన ప్రవక్తవలెనే నీవును చెప్పగలవు. ఆయన వాక్యము కొరకైన ఆకలిని బాగాకలిగియున్న ఆ ప్రవక్తకు ఆయన మాటలు దొరకగానే ఆయన వెంటనే వాటిని భుజించెను. అట్టిసుభోజనముగా ఆయన ఆకలి తీర్చుకొను ఆహారముగా తన వాక్యమును ఆత్మతండ్రి మనకు అనునిత్యమువడ్డించునుగాక ! ఆమెన్‌. 

4. ఆయన శరీర రక్తముల కొరకైన ఆకలి : (లూకా 6:21;22:15) ప్రభువు సంస్కారపు ఆరాధనలో ‘మీరు ఆకలిగొని వచ్చిన యెడల మీరాకఎంతో మంచిది, అని వ్రాయబడినది. అలాగుననే మన ప్రభువును ‘ఇపుడు ఆకలిగొనియున్న మీరు ధన్యులు’ అనిపలుకుచున్నాడు. అది ఆయన శరీరరక్తములకొరకైన ఆకలే. గనుకనే ఆయన నా శరీరము తిని నా రక్తముత్రాగువాడే నిత్య జీవము గలవాడని చెప్పుచూ, ఆ నిత్య జీవము కలిగించు శరీరరక్తముల కొరకైన ఆకలిని మనము కలిగి ఉండవలసిన వారముగా తన జీవములో నుండి మనకుజ్ఞాపకము చేయుచున్నాడు. గనుకనే నేను శ్రమ పడకమునుపు మీతో కూడా ఈపస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అనగా ఆకలిగొని యుంటిని అని (లూకా 22;15) చెప్పుచున్నాడు. ప్రియుడా ! ఇట్టిఆకలిని నీవు కలిగి ఉండగలవా? “ఎప్పుడెప్పుడు నీలోనికి వచ్చెదనా? ఎప్పుడెప్పుడునా శరీర రక్తముల ద్వారా నీ ఆకలిని తీర్చెదనా”? అని నీప్రాణ ప్రియుడు నీ ఆకలి తీర్చుటకు ఆకలిగొనియుండగా, ఆయన ఆకలితీర్చుట కొరకు ఆయన శరీర రక్తములకొరకైన ఆకలి నీవు కలిగియుండవా? ఇట్టిఆకలిని ఆత్మ తండ్రి నీకు కలగించి, నిన్ను తన శరీర రక్తములతోపోషించును గాక ! ఆమెన్‌.

5. సువార్త ప్రకటించుటకొరకైన ఆకలి : (1 కొరింథి 4:11)‘అయ్యో ! నేను సువార్తను ప్రకటించకపోయినయెడల నాకు శ్రమ’ అని అపోస్తలుడైన పౌలు సువార్త కొరకైనఆకలిగొని అంతటనూ సువార్తను ప్రకటించాడు. సువార్తకొరకైన ఆకలి విరివిగాకలిగియున్నందుననే ఈ లోకమందున్న తన ఆకలి దప్పికలను పట్టించుకొనక, సమయమందును, అసమయమందును సువార్తను ప్రకటించెను. ప్రయాణములలోప్రకటించాడు, మేడలమీద, కోటలలో, గృహము లలో, పొలములలో, సముద్రపు టొడ్డున ఈ లాగునఅపోస్తలుడైన పౌలు క్రీస్తు సువార్తను అన్ని స్థలములలో, అన్నివిధములుగా ప్రకటించాడు. ఆయన సువార్తను ప్రకటించుటకై ఆయనలో ఉన్న ఆకలిఅంత గొప్పది గనుకనే ‘నేనైతే  క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తనుప్రకటించవలెనని మిక్కిలి ఆశగల వాడనై యుండి (మిక్కిలి ఆకలిగొని), ఆలాగునప్రకటించితిని’ (రోమా 15:20-21)అనివ్రాయుచున్నాడు. నీవు ఆయన సువార్తను ఆలాగున ప్రకటించని యెడల ఆయనదప్పికను, ఆకలిని ఏలాగున తీర్చగలవు. ఆయన రాకడ సువార్తను ప్రకటించుటలో అటువంటిఆకలిని ఆయన మీలో పుట్టించి, తన రాకడ మర్మములతో నిన్ను పోషించునుగాక ! ఆమెన్‌   

6. ఆత్మఫలములకొరకైన ఆకలి : (మత్తయి 21:18)నీ ప్రాణప్రియుడు ఈ లోకములో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు అను అంజూరపు చెట్టున ఫలములు ఆశించి, వారినుండిఆచారములను ఆకులు తప్ప మరేమియు కనుగొన లేకపోయెను. గనుకనేఆత్మపలముల కొరకైన నీ ప్రాణప్రియుని ఆకలిని తీర్చుటకు ‘కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి’(1 కొరింథి 12:31) అని పరిశుద్ధాత్మ తండ్రివ్రాయించాడు. ఆసక్తితో అనగా ఆకలితో అపేక్షించుడి అని భావము. గనుక ‘ అతని ఫలము నా జిహ్వకు మధురము (ప.గీ 2:3)అనిపలుకుచున్న పరమగీతములోని పెండ్లికుమార్తెవలె ఆయన ఆత్మఫలముల కొరకు మనము ఆకలిగొని, వాటిలోనిమధురమైన మహిమా స్థితితో మన ఆకలి తీర్చుకొనవలెను. ఆయనఆత్మఫలములకొరకు ఆది సంఘము ఆకలిగొనినందున శరీరాకలి, దప్పికలుమరచిపోయి, 10 దినములు ఏకాగ్రతతో ఆయన ఆత్మ ఫలములు, వరముల కుమ్మరింపు కొరకుకనిపెట్టు కొనిరి. అట్టి కనిపెట్టు ఆకలిని ఆత్మతండ్రి మనలోరగిల్చి, తన ఆత్మవరముల, ఫలములవిందుతో మనలను పోషించునుగాక ! ఆమెన్‌.   

7. ఆయనను చూచుటకొరకైన ఆకలి : (కీర్తన 63:2)‘ నీమీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరముకృశించుచున్నది’ అని దైవజనుడైన దావీదుపలుకుచున్నాడు. ‘జీవముగల దేవుని దర్శించుటకు నాహృదయము ఆనందముతో కేకలువేయుచున్నది’ అని వ్రాసిన ఆయనే, ఆయననుచూచు ఆకలితో, ఆశతో తన శరీరము కృశించిపోవుచున్నది. అనగా ఎండిపోవుచున్నది, శుష్కించిపోవుచున్నదిఅని పలుకుచున్నాడు. ప్రియ విశ్వాసీ ! ఇట్టిఆకలి నీవు కలిగియుండ గలవా? ఇదే అన్నిటికన్న గొప్ప ఆకలియై యున్నది. ‘నేను మేల్కొనునప్పుడు ప్రతి దినము నీ స్వరూప దర్శనముతో నా ఆశ (ఆకలి) తీర్చుకొందునని’(కీర్తన 17:15) ఈ దైవజనుడేసాక్ష్యమిచ్చుచున్నాడు. ఇట్టి నిజమైన ఆకలి నీవు కలిగియున్నయెడల ‘యదార్థవంతులు ఆయన ముఖదర్శనము చేయుదురు’ అను వాగ్దానమునుస్వతంత్రించుకోగలవు. (కీర్తన 11:7). అట్టి ధన్యస్థితితో ఆత్మ తండ్రిమనందరినీ పోషించునుగాక ! ఆమెన్‌.

 

PRAYER - 3

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on May 17, 2011 at 2:36 AM Comments comments (0)

     సైతాను ఒక్క ప్రార్థనకు తప్ప మరి దేనికీ భయపడడు అనే విషయాన్ని మనంగుర్తుంచుకోవాలి. మనం ప్రార్థన చేయకుండా ఉండాలనేదే వాడి ఏకైక కోరిక. మనం బైబిలువిద్యార్థులుగా అత్యంత ఆసక్తితో, శ్రద్ధతో చదవుతూఉంటే వాడు వెరువడు. సైతాను మనశ్రమల్ని చూచి నవ్వుతాడు. మన తెలివితేటల్ని చూసి ఎగతాళి  చేస్తాడు. కాని మనం ప్రార్థన చేస్తున్నపుడుమాత్రం గజగజ వణికిపోతాడు.

     మన జీవితంలో దేవునికి మానవున్ని సమీపం చేయగలిగిన అతి గొప్ప కార్యంప్రార్థన ఒక్కటే.

     ప్రయత్నయుక్తమైన పనులకంటే ప్రార్థనతోనే మనం ఎన్నో ఘనకార్యాలనుసాధించగలం. 

     మోకరించే క్రైస్తవుడు ఆయనను కనుక్కొగలుగుతున్నాడు. అదే సమయంలో దేవుడుఅతన్ని కనుగొంటున్నాడు.

ప్రార్థించేవారికి పరిశుద్ధాత్మ శక్తి:

            యేసుక్రీస్తు  పరలోకమునకు ఆరోహణుడయ్యే ముందు తానుఏర్పరచుకొనిన వారితో తండ్రియొక్క వాగ్దానము కొరకు యెరూషలేములోనే ఉండికనిపెట్టమన్నాడు. (అపొ.కా.1:4,5, లూకా 24:49) అట్లు తండ్రి వ‍గ్దానము అయినపరిశుద్ధాత్మతో బాప్తీస్మము పొందుకున్నపుడు వారు శక్తి పొందుకొని యేసుకుసాక్షులుగా ఉంటారని కూడా యేసు చెప్పాడు. (అపొ.కా.1:8) ఇట్లు యేసు శిష్యులును, మరికొందరి స్త్రీలును ఏకమనస్సుతోఎడతెగక ప్రార్థించి పరిశుద్ధాత్మశక్తిని పొందుకున్నారు.(అపొ.కా.1: 13,14, 2:1,4) తండ్రియైనదేవుని ప్రార్థిస్తే యేసుక్రీస్తు ద్వారా మనము పరిశుద్ధాత్మను పొందుకుంటాము లూకా11:13,3:16, యోహాను 7:37-39)

v అలాగు ప్రార్థించిపరిశుద్ధాత్మను పొందుకొనిన అపోస్తలులు బహు బలముగా యేసును గురించి సా‍క్ష్యమియ్యగలిగారు.(అపొ 4:33)

v  స్తెఫను గొప్ప సూచక క్రియలుచేయగలిగాడు.(అపొ:6:3-8).

v  అదివరకు ప్రార్థించిన పేతురు అన్యజనుడైనకొర్నేలీ ఇంటికి వెళ్ళి సువార్తను ప్రకటించగలిగాడు. అపొ.కా. 10:9-48)

v  ప్రార్థన‍ ఫలితంగానే పరిశుద్ధాత్ముడు పౌలు మరియుబర్నబాలను అనేక దేశాలలో వారు సువార్త ప్రకటించుటకు వారిని ప్రత్యేకించుకున్నాడు.(అపొ.కా 6:3-8)

v పౌలు ఏ దేశాలలోసువార్త ప్రకటించాలో లేదా ఏ దేశాలలో సువ‍ర్త ప్రకటించకూడదో పరిశుద్ధాత్ముడే పౌలునుఆదేశించి నడిపించాడు.(అపొ.కా 16:6-10) మరియు పవలుచేత దేవుడు విశేషమైన అద్భుతాలు చేయించాడు.(అపొ.కా.19:11,12)

v యేసుప్రభువు కూడాతాను బాప్తిస్మము పొందిన పిమ్మట ప్రవచనములలో వ్రాయబడినట్లుగా కొలత లేనంతగాపరిశుద్ధాత్మచే అభిషేకించబడ్డాడు. (యెషయా 11:2, 42:1, యొహాను1:32, మత్తయి 3:16,యోహాను 3:34)

v యేసు తన మూడన్నరసంవత్సరముల పరిచర్య పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాతనే ప్రారంభించాడు.అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచాడు. (అపో.కా 10:38)  తాను ప్రార్థించి పరిశుద్ధాత్మ ద్వారానే తన్నుతాను సిలువకు అప్పగించుకొని మనకు రక్షణ సిద్ధము చేశాడు. (హెబ్రీ 9:14) మనము కూడాప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకోవాలి కదా!!!

v ప్రార్థన ఫలితంగామనము పొందుకొను పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు మరియు మనలో ఉంటాడు (యోహాను 14:12-17)

v యేసు చెప్పినసంగతులను మనకు జ్ఞాపకం చేస్తాడు (యోహాను 16:18) మనలో నివసించుచు యేసును గురించిసాక్ష్యమిస్తాడు. (యోహాను 14:12-17)

v మన హృదయములో దేవునిప్రేమను కుమ్మరింపజేస్తాడు. (రోమా 5:5)

v ఆత్మ స్వభావము కలుగజేస్తాడు(రోమా 8:8)

v ఏమి మాట్లాడాలోనేర్పిస్తాడు. (లూకా 12:12)

v మనలనుసర్వసత్యములోనికి నడిపించి సంభవింపబోవునవి తెలియజేస్తాడు. (యోహాను 16:13)

v ఆయన పిల్లలమైన మనముపరిశుద్ధాత్మతో సరియైన సహవాసము కలిగి ఉండాలనేదే దేవుని చిత్తము అయిఉన్నది

v పరిశుద్ధాత్మతోసరియైన సన్నిహిత సంబంధము లేకుంటే శక్తిగల కార్యాలను, అద్భుతాలను చూడడం అసాధ్యం

v మనము దేవునివాక్యాన్ని ధ్యానించుచు సరియైన మార్గములో నడిపింపబడుట వలన క్రీస్తుకు సాక్షిగాజీవించాలన్నదే పరిశుద్ధాత్మ ఉన్నతమైన ఉద్దేశ్యము

v పరిపూర్ణ సమర్పణకలిగిన జీవితములో దేవునితో చెలిమి చేసినపుడే ఆయన మనలను అభిషేకిస్తాడు.

v  ఆత్మసంబంధమైన కార్యాలను చేయుటలో పరిశుద్ధాత్మునిసహాయము నీకు తప్పక ఉంటుంది.

 

ప్రార్థనయందు ఐక్యత

     యేసు ఇతరులతో కలిసి ప్రార్థించెను.

     రూపాంతరమందు (లూకా 9:28,29)

     గెత్సెమనే వనములో (మత్తయి 26:36,38)

 

ఆది సంఘము ఏకమనస్సుతో ప్రార్థించెను

     దేవాలయములో ఎడతెగక ప్రార్థించిరి (లూకా24:52,53)

     మేడగదిలో అందరూ కలిసి ప్రార్థించిరి(అ.కా. 1:14)

     పెంతెకోస్తు దినమున ఒకేచోట ఉండిరి(అ.కా. 2:1-4)

     పేతురు, యోహానులు ప్రార్థనకు కలిసివెళ్ళిరి (అ.కా.3:1)

     వారు ఏకమనస్సుతో దేవునికి బిగ్గరగామొర్రపెట్టిరి (అ.కా. 4:23,24)

     అనేకులు కూడి ప్రార్థన చేసిరి (అ.కా.12:12)

     పౌలును, సీలయు కలిసి ప్రార్థించిరి(అ.కా. 16:25)

 

కలిసి ప్రార్థించువారికి ఇవ్వబడిన వాగ్ధానములు

     ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడియుందురోక్రీస్తు అక్కడ ఉండును (మత్తయి 18:20)

     తాము వేడుకొను సంగతిని గూర్చి ఏకీభవించినఅది జరుగును (మత్తయి 18:19)

 

      పరిశుద్ధాత్మతో నింపబడిగొప్ప ప్రార్థనాపరులముగా ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు తీర్మానంచేసుకుందాం. ఎల్లప్పుడూ ప్రార్థనకు ప్రథమస్థానం ఇచ్చి దేవుడిచ్చే సర్వోత్కృష్టపలితాలను అనుభవించి ఫలభరిత జీవితం జీవించునట్లు సర్వోన్నతుడైన దేవుడుప్రార్థనాజీవితం నీకనుగ్రహించి సర్వసమృద్ధిలోనికి నిన్ను నడిపించును గాక. ఆమెన్!!!

ఉపయుక్త గ్రంధములు:

1.      కల్వరి ప్రేమధార(ఆధ్యాత్మిక ద్విమాస పత్రికలు) డా. ఎన్‌. జయపాల్‌

2.      విజయవంతమైనక్రైస్తవ జీవితానికి అత్యవసరమైన పునాదిరాళ్ళు – బిషప్‌ డార్లింగ్‌స్టన్‌.జి.జాన్సన్‌

3.      కాపరి దుడ్డుకర్ర

4.      దెబోరాస్వరం – జాయ్‌చెరియన్‌

5.      ఎడారిలో సెలయేర్లు- చార్లెస్‌కౌమన్‌

6.      కాపరి క్రైస్తవనాయకత్వ మాసపత్రిక – శ్రీమతి మరియమ్మ కిశోర్

            ప్రభువైన యేసుక్రీస్తునామమున వందనములు. ఈ పుస్తకం ప్రతిఒక్కరినీ విశ్వాసములో పురికొల్పుతూ, గొప్ప ప్రార్థనాయోధులుగావిజయవంతమైన ఆత్మీయజీవితం కలిగి ఉండాలనే ఆశతో వ్రాయబడింది. కేవలం ఆత్మీయఉజ్జీవంకొరకు మాత్రమే  ఉద్ధేశింపబడింది. ఈపుస్తక రచనకు సహకరించిన పై పుస్తక రచయితలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాను.  

 Dr. S. CHANDRA KIRAN

S. MANJULA RANI

 

 


PRAYER - 2

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on May 17, 2011 at 2:27 AM Comments comments (0)

నీనెవెవారు                       (యెనా   3:4 – 10)         

అన్న                            (లూకా   2:37)

అంతియొకయలోని  ప్రవక్తలు,బోధకులు  (అపొ . కార్య.   13: 1 – 3)

అనేక  సంఘములు           (అపొ . కార్య.   14:23) 

పౌలు                    (llకొరింధీ  6:5;11:27)

బైబిలులో నలభై రోజులు ఉపవాస ప్రార్థనచేసినవారు

1. మోషే  ద్వితీయో   9:9; 10:10)

2. యెహోషువ (నిర్గమ  24:12-18;  32:15-17)

3. ఏలియా (1  రాజులు  19:7-8)

4. యేసు  ప్రభువు (మత్తయి   4:1 – 11)

ఇటువంటి ప్రార్థన చేయకూడదు

     విస్తరించిన మాటలతో                  మత్తయి 6:7

     హృదయములో పాపముతో         కీర్తన 66:19

     ఆయాసపడి                              యెషయా 16:12

     అవిశ్వాసముతో                          మార్కు 1:24

     శయ్యలపై పరుండి                       హొషేయ 7:14

     పరిసయ్యుడిలా లూకా  18:11,12

     దీర్ఘ ప్రార్థనలు     మార్కు  12:38-40

     ధర్మశాస్త్రము వినకుండ సామెతలు  28:9

 

సమస్యలకు భయపడి దేవుని నిర్ణయమునకు విరోధముగాప్రార్థించకూడదు. నిర్గమ 3:4-11, 4:1-14)

ప్రార్థనలకు జవాబురాకపోవడానికి కారణాలు

     ఒప్పుకోని పాపము                   కీర్తన 66:18      

     వేషధారణతో  ప్రార్థించుట   మత్తయి 6;5

     అపనమ్మకము గలప్రార్థన          యాకోబు 1:5,6

     అపవాది క్రియలు దానియేలు 10: 10-13

     అభ్యంతరములు కల్గిన ప్రార్థన       1 పేతు 3:7

     గర్వముతో కూడిన ప్రార్థన లూకా18: 10-14

     దేవునిది దోచుకుంటూ చేసే ప్రార్థన. మలాకి 3:8-10

 

బైబిలులోని కొన్ని ప్రార్థనలు:

     చనిపోయిన  విధవరాలి  కుమారుని  కొరకు  ఏలియాయెక్క ప్రార్థన   (1రాజు 17:20-21)

     ఒకశతాధిపతి తనసేవకుని కొరకు చేసన ప్రార్థన                (మత్తయి8:5-9)

     అపవిత్రాత్మ పట్టినాడొకడు తనకొరకు తానే చేసిన ప్రార్థన   (మార్కు 5:6)

     అధికారి తన కుమార్తె కొరకు చేసిన ప్రార్థన                       (మత్తయి 9:18)

     రక్రస్రావరోగముగల స్త్రీ తనకొరకు తానే సేసిన ప్రార్థన       (మత్తయి 9:20,21)

     ఇద్దరు గ్రుడ్డివారు తమకొరకు తామే చేసిన ప్రార్థన              (మత్తయి 9:27)

     ఒకకానాను స్త్రీ తన కుమార్తె కొరకు చేసిన ప్రార్థన       (మత్తయి 15:21-28)

     బర్తిమయి తనకొరకు తానే చెసిన ప్రార్థన (మార్కు 10:46,47)

     మార్తామరియలు వ్యాధిగ్రస్తుడైన తన తమ్మునికొరకు చేసిన ప్రార్థన(యోహాను 11;30)

     పౌలు పాప్లి యొక్క తండ్రి కొరకు చేసిన ప్రార్థన (అపో.28:8)

     ఒక ప్రధాని తన కుమారుని కొరకు చేసిన ప్రార్థన (యోహాను 4:46-50)

     చనిపోయిన విధవరాలి కుమారుని కొరకు ఏలియా యొక్క ప్రార్థన(1రాజులు 17;20,21)

     చనిపోయిన షూనేమీయురాలి కొరకు ఎలీషా ప్రార్థన (2 రాజులు4;33-35)

     చనిపోయిన దొర్కా (తబితా) కొరకు పేతురు యొక్క ప్రార్థన(అపో.28:8)

     పన్నెండు గొత్రీకులను ఆశీర్వదించమని యాకోబు చేసిన ప్రార్థన(ఆది.48-49)

     ఐగుప్తు నుండి విడిపించమని ఇశ్రాయేలీయులు చేసిన ప్రార్థన(నిర్గమ 2:23)

     ఇశ్రాయేలీయులను బాధించకుండునట్లు మోషే చేసిన ప్రార్థన (నిర్గమ32:31,32 సంఖ్యా 11:1,2 21:7-9)

     ఇశ్రాయేలీయులను సంరక్షించమని మోషే చేసిన ప్రార్థన (సంఖ్యా10:35,36 )

     తమ్మును నడిపిమచుటకొరకు ఇశ్రాయేలీయిలు చేసిన ప్రార్థన ( న్యాయా1:1)

 

బైబిలులోని  క్లుప్త ప్రార్థనలు

¯ సుంకరి          –  ప్రభువా, నన్ను కరుణించుము  - లూకా 18:13

¯ పేతురు           -  ప్రభువా, నన్నురక్షించుము      - మత్తయి 14:30

¯ దావీదు          - ప్రభువా నన్ను పరిశోధించుము   - కీర్తన 139: 23

¯ కుష్ఠురోగి         - ప్రభువా, నన్ను శుద్ధునిగా చేయుము – మత్తయి 8:2       

¯ దావీదు          - ప్రభువా, నన్ను కడుగుము – కీర్తన51:2   

¯ సమూయేలు    - ప్రభువా, ఆజ్ఞయిమ్ము – 1 సమూయేలు 3:10

¯ మానోహ         - ప్రభువా, మాకు నేర్పించుము – న్యాయాధి13:8

¯ శిష్యులు          - ప్రభువా, ప్రార్థన నేర్పుము – లూకా 11:1

¯ దావీదు          - ప్రభువా, నా కన్నులు తెరువుము  - కీర్తన 119:18

¯ కనాను స్త్రీ        - ప్రభువా, నాకు సహాయము చేయుము – మత్తయి15:25

¯ సమ్సోను        - ప్రభువా, నన్ను బలపరచుము – న్యాయాధి16:16:28           

¯ సిలువపై దొంగ   - యేసూ, నన్ను జ్ఞాపకము చేసుకొనుము – లూకా 23:42

¯ మోషే            - ప్రభువా, నీ మహిమనునాకు చూపుము – నిర్గమ 33:18

¯ పౌలు             - ప్రభువా, నేనేమిచేయవలెను – అపొ.కార్య. 22:10

¯ యెషయా        - ప్రభువా, నన్ను పంపుము – యెషయా 6:8

యేసుప్రభువు ఆయా సంధర్భములలో చేసిన ప్రార్థనలు

ü యోర్దాను నదిలో బాప్తీస్మము పొందినప్పుడు ప్రార్థించెను(లూకా 3:21)

ü ఇంకను చీకటిఉండగానే ఏకాంత స్థలముకు వెళ్ళి ప్రార్థించెను. (మార్కు 1:35)

ü అరణ్యములోనికివెళ్ళి ప్రార్థించెను (లూకా 6:12)

ü శిష్యులనుఎన్నుకొనుటకు ముందు, రాత్రంతా ప్రార్థించెను (లూకా 6:12)

ü ప్రయాసపడి భారముమోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి... అని చెప్పుటకు ముందుప్రార్థించెను (మత్తయి 11:25-27)

ü అయిదు రొట్టెలురెండు చేపలు పంచిపెట్టుకు ముందు ప్రార్థించెను (యోహాను 6:11)

ü అయిదు రొట్టెలు,రెండు చేపలు పంచిపెట్టిన తరువాత ప్రార్థించెను. (మత్తయి 14:23)

ü శిష్యులకు ప్రార్థననేర్పుటకు ముందు ప్రార్థించెను (లూకా 11:1-4)

ü నేనెవరినినని జనులుచెప్పుకొనుచున్నారని అడుగుటకు ముందు ఒంటరిగా ప్రార్థించెను (లూకా 9:18)

ü రూపాంతరము పొందుటకుముందు ప్రార్థించెను (లూకా 9:28,29)

ü శిష్యులు దయ్యములనునీ నామమున వెళ్ళగొట్టితిమని చెప్పిన సమధర్భములో ప్రార్థించెను (లూకా 10:21)

ü చిన్నపిల్లల కొరకుచేతులుంచి ప్రార్థించెను (మత్తయి 19:13)

ü సమాధిలో ఉన్నలాజరును బ్రతికించుటకు ముందు ప్రార్థించెను (యోహాను 11:41,42)

ü యెరూషలేములోనిమందిరములో ప్రార్థించెను (యోహాను 12:27,28)

ü ప్రభురాత్రి భోజనముముందు ప్రార్థించెను (మత్తయి 26:26,27)

ü పేతురు కొరకుప్రార్థించెను (లూకా 22:31,32)

ü శిష్యుల కొరకుప్రార్థించెను (యోహాను 17:1-26)

ü గెత్సేమనేలో చెమటరక్తమగునంతగా ప్రార్థించెను (లూకా 22:39-44)

ü సిలువపై తననుహింసించువారిని క్షమిస్తూ ప్రార్థించెను (లూకా 23:34)

ü ఎమ్మాయి గ్రామములోఇద్దరు శిష్యులతో ప్రార్థించెను (లూకా 24:30)

ప్రార్థన వలన ఆశీర్వాదములు

 

     ప్రార్థన చేసేవారు పాపము చేయలేరు                                         

     ప్రార్థన నీ చింతలను తొలగిస్తుంది

     ప్రార్థన నమ్మకత్వాన్ని కలిగిస్తుంది

     ప్రార్థన నిన్ను సరిచేస్తుంది

     ప్రార్థన నీకు జ్ఞానము నిస్తుంది

     ప్రార్థన నీ సమస్యలకు పరిష్కారమవుతుంది

     ప్రార్థన నీ ప్రతి  అవసరతను  తీరుస్తుంది

     ప్రార్థన వలన నీకు ఫలభరితమైన  జీవితం  లభిస్తుంది

     ప్రార్థన నీకు  మంచి  ఆలోచనలనిస్తుంది

     ప్రార్థన  ద్వారా  దేవుని ప్రేమతో  నింపబడతావు

     ప్రార్థన  వలన  దేవుని వాగ్దానములు  నీపట్ల  నెరువేరుతాయి

     ప్రార్థన  ద్వారా  దేవుని కరుణ కృప  నీమిద నీ కుటుంబము  మిద కుమ్మరింపబడుతుంది

     ప్రార్థన  కీడు రాకుండాకాపాడుతుంది

     ప్రార్థన ద్వారా నీవు ఆత్మతో నింపబడతావు

     ప్రార్థన ద్వారా  శత్రువుపై  జయం కలుగుతుంది

     ప్రార్థన ద్వారా దైవ చిత్తమును  నెరవేర్చే శక్తివస్తుంది

     ప్రార్థన ద్వారా  రోగములు  తొలగిపోతాయి

     ప్రార్థన ద్వారా  శాపముల  నుండి విముక్తి  కలుగుతుంది

     ప్రార్థన చేసే దు:ఖదినములు సమాప్తమగును

     ప్రార్దించువారు ఉన్నతమైన స్దితిలో  ఉంటారు 

 

ఉదయముననే లేచి ప్రార్థించి దేవుని ద్వారాఅద్భుతాలు చేసిన ఈ క్రింది వారిద్వారా బలపడదాం

¯  ఉదయమే లేచిదేవుని ముందు నిలబడిన అబ్రహాము   ఆది19:27

¯  ఉదయమే లేచిదేవుని ఆరాధించిన యాకోబు ఆది28:18

¯  ఉదయమే లేచిదేవునికి బలిపీఠం కట్టిన మోషే        నిర్గమ 24:4

¯  ఉదయమే లేచిసీనాయి కొండపై దేవుని కలుసుకొనుట      నిర్గమ 34:4

¯  ఉదయమే లేచిహన్నా, ఎల్కానా దేవుని సన్నిధికి వెళ్ళిరి 1 సమూ1:19

¯  ఉదయమే లేచిబలులు అర్పించిన యోబు             యోబు 1:5

¯  ఉదయమే లేచిదేవుని ప్రార్థించిన దావీదు             కీర్తనలు 119:147, 57:8

¯  ఉదయమే లేచితన నాలికలతోబాటు దేవుని సన్నిధికి వెళ్ళినహిజ్కియా 11 దిన29:20

¯  ఉదయమే లేచిప్రార్థించిన దేవుని కుమారుడైన యేసు     మార్కు 1:35

      

వివిధ రకాలైన ప్రా ర్ధనలు

·        విధేయతగల్గిన,తగ్గింపుగల ప్రార్ధన  కీర్తన  101:17

·        ధైర్యపరుచు ఆత్మ ప్రార్ధన  1యెహో  5:13-15

·        నమ్మకంగల్గిన ప్రార్ధన హెబ్రీ 1:6                                  

·        నిజముగా మొర్ర పెట్టు  ప్రార్ధన కీర్తన 145:18

·        సహజమైన ప్రార్ధన   మత్తయి 6:7

·        దీర్ఘశాంతపు ప్రార్ధన లూక 18:7, కొల 4:2                                                      

·        దేవుని చిత్తానుసారమైనప్రార్ధన 1యెహాను 5:15                                

 

అనేకుల  కొరకు  విజ్ఞపన ప్రార్ధన  ఎలా చేయాలి?

నీ  కుడిచేతిని  నీ ఎదురుగా  ఉంచుకొని  నీ చేతి  వ్రేళ్ళను  చూస్తూ అనేక  బారముల  కొరకు మరువకుండా  ప్రార్ధించవచ్చు

¯ బొటన  వ్రేలు : ఈ బొటన  వ్రేలు  మీకు దగ్గరగా ఉంది.  కాబట్టి  ఈ బొటనవ్రేలు  చూచినప్పుడెల్లా  మీ కుటుంబము కొరకు, రక్తసంబంధుల కొరకు, ఇరుగు  పొరుగు  వారి కొరకు  ప్రార్ధంచండి

¯ చూపుడు  వ్రేలు  :  సాధారణముగా  ఉపాధ్యాయులు, బోధకులు  ఈ చూపుడు  వ్రేలును చూపిస్తూ,  మనల్ని  హెచ్చరిస్తూ బోధిస్తూ  యుందురు  కాబట్టీ  ఈ వ్రేలు  చూచినప్పుడల్లా  ఉపాధ్యాయుల కొరకు,  నడిపించువారికొరకు  ప్రార్ధించండి!

¯ మధ్య  వ్రేలు :  ఇది  అన్ని  వ్రేళ్ళకంటే ఎత్తుగా  ఉన్నది. గనుక  ఇది రాజులకు, అధికారులకు  గుర్తుగా  ఉన్నది, ఈ  మద్య  వ్రేలును చూచినప్పుడల్లా,  రాజుల  కొరకు, అదికారుల  కొరకు  ప్రార్ధించండి

¯ 4. బలహీనమైన  వ్రేలు:   ఈ  బలహీనమైన వ్రేలును  చూచినప్పుడల్లాబలహీనుల  కొరకు,  పేదల కొరకు,  వ్యాధిగ్రస్ధుల  కొరకు ప్రార్ధంచండి

¯ చివరిగా  చిటికెన వ్రేలు :  ఈ  చిటికెన వ్రేలు  చూచినప్పుడల్లాప్రభువా  చిన్నవాడిని  నన్ను కనికరించు  అని  నీ కొరకు,  నీ  అవసరతల కొరకు ప్రార్ధించుకొనుము

     ఈ    ఐదు  వ్రేళ్ళ ప్రార్ధన  గుర్తుంచుకోండిఅందరి  కొరకు  ప్రార్ధన   చేయండి

     కన్నీటితో  కడిగిన  ముఖం దేవునికి  బహు సుందరముగా  కనబడును.  గనుక  కన్నీటి ప్రార్ధన  చేయండి

     మీ మోకాళ్ళు  నల్లగా ఉంటె,  మీ  ముఖం తెల్లగా ఉండునన్నాడు  ఓ  భక్తుడు. కాబట్టి మోకాళ్ళపై ప్రార్ధించటం    నేర్చుకోండి  

     నీవు ఒకదాని విషయం కష్టపడుతూ గుండ్రంగా దానిచూట్టూ తిరుగుతు వుండి,నేనెందుకు  ఎదగలేక   పోతున్నానని ఆశ్చర్య పోతున్నావంటే   దాని అర్ధం నీవు ప్రార్థన   నేర్చుకోలేదనే  చెప్పాలి

     దేవుడు  మానవున్నిసృష్టంచినప్పుడు,  మానవునితో సహవాసం  చేయడం ఆయన  ముఖ్య  ఉద్దేశ్యం. 

     దేవునితో  ఏకాంతంగా  సన్నిహితంగా ఉండే  స్ధలానికి  నీవు వెళ్లకపోతే,  దేవునితో  నీవు పైపై  సంబంధమును  మాత్రమే కలిగియుంటావు

     దేవునితో  ఏకాంతంగా  గడపడానికి నీకు  ఒక  రహస్య స్ధలము  లేకపోతే,  వెంటనే ఆలాంటిది  నీకు  ఒకటి కావాలి

     ప్రభువుతో నీవు ఏకాంత గదిలోనికి ప్రవేశించినపుడు మొట్టమొదట నీవుచేయాల్సిన పని ఆయన సన్నిధి అక్కడ ఉందని తెలుసుకోవాలి

     నీవు ప్రార్థించునపుడు బైబిలు సత్యములను,  బైబిలు  వచనాలను స్మరించడము  కూడ  నీకు ఎంతో సహాయపడుతుంది

     దేవునితో సంభాషించడము, మరియు సహవాసమును కోల్పోతే నీవు శక్తిని కూడాకోల్పోతావు. అదెలా ఉంటుందంటే కరెంటు కనెక్షను తీసివేయబడిన విద్యుత్  పరికరంలా ఉంటుంది 

     నీవు దేవునితో జతపరచబడాలంటే నీవు ఆయనతో నిరంతరం సహవాసం కలిగి ఉండాలి

     నీకు దేవుని జ్ఞానం కావాలి అనుకుంటే దేవునితో  సంభాషించ డానికి నీవు ప్రాధాన్యత నివ్వాలి

      యెహోవాను వెదుకువారు హృదయమందుసంతోషించుదురు

     నీవు దేవున్ని వెదుకునప్పుడు నీహృదయమును సంతోషింపనివ్వాలి. మరియు ఆయనఆశ్చర్య కార్యములను నీవు తప్పక జ్ఞాపకము చేసుకోవాలి.

     ఆయనను ఆరాధించడము మరియు స్తుతిండమనేది దేవున్ని వెదకడమనే పద్దతితోసంబంధము కలిగి ఉంది

     నీవు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీవు సంతోషించాలి. ఎందుకంటే నీచిరునవ్వు ముఖమును చూడాలని ఆయన ఆశిస్తున్నాడు

     నీవెంత నిర్ధిష్టంగా ఉంటావో నీ స్తుతి అంత శక్తివంతముగా ఉంటుంది, మరియుఅంత త్వరగా నీవు దేవుని సన్నిధిలో ప్రవేశిస్తావు

     దేవుడు నాలుగు ప్రధానమైన పద్ధతులద్వారా మాట్లాడతాడు. ఆంతర్య సాక్ష్యము,ఆంతర్య స్వరము, వెలుగుమయమైన వాక్యము, పరిశుద్ధాత్మ వరములు

     సైతాను ఒక్క ప్రార్థనకు తప్ప మరి దేనికీ భయపడడు అనే విషయాన్ని మనంగుర్తుంచుకోవాలి. మనం ప్రార్థన చేయకుండా ఉండాలనేదే వాడి ఏకైక కోరిక. మనం బైబిలువిద్యార్థులుగా &

PRAYER

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on May 17, 2011 at 2:17 AM Comments comments (1)

ప్రార్థన

                క్రైస్తవునికి ప్రార్థన ఊపిరి వంటిది. ప్రార్థన లేకుండా క్రైస్తవునిగాజీవించలేమని మనకు తెలుసు. వ్యక్తిగత జీవిత భౌతిక, ఆత్మీయ అభివృద్ధికి, సంఘఅభివృద్ధికి, ఆత్మల రక్షణకు, ఉజ్జీవమునకు అన్నిటికీ ప్రార్థనే ఆధారం. ప్రపంచంలోఉజ్జీవాలన్నీ ప్రార్థన ద్వారానే వచ్చాయి. గొప్ప దైవజనుల విజయ రహస్యం ప్రార్థనే.ప్రార్థనకు ఇంత ప్రాముఖ్యత ఉన్నదని తెలుసుకున్నను అనేకమంది క్రైస్తవులు ప్రార్థనలకొరకు ఎన్నో తీర్మానములు చేసుకున్నను శరీర బలహీనతను, మత్తును జయించలేక తగినంతగాప్రార్థించలేకపోతున్నారు. ఎందుకనగా సొంతశక్తితో ఎవరూ సంపూర్ణమైన ప్రార్థనచేయలేరు. 

ప్రార్థన అంటే :

Ø ప్రార్థన అంటేదేవునితో సంభాషించుట, అనగా దేవునితో మాట్లాడుట, దేవుని మాట వినుట. నిజమైన ప్రార్థనఅంటే “మానవాత్మ పరిశుద్ధాత్మ సహాయంతో  దేవుని కృపాసనం వద్దకు వెళ్ళడం” అన్నారు చార్లెస్ స్పర్జన్

Ø మాటల్లోనూ,మౌనంలోనూ వ్యక్తమయ్యే ఆత్మలోని తృష్ణే ప్రార్థన.  నివురు గప్పిననిప్పులా ఉంటూ  నిత్యం దహింపజేసేదిప్రార్థన

Ø ప్రార్థన ఒకహృదయాభిలాష, అది భాష కందనిది,గుండెలను కదిలించే అజ్ఞాత అగ్నిజ్వాల

Ø మన పాపాలనుఅంగీకరిస్తూ, దేవుని కనికరానికి  ఆయనకుకృతజ్ఞత తెలపడం. అంతేకాదు; క్రీస్తు నామంలో మన అవసరాలను దేవునికి తెలిపి వాటినిఆయన చిత్తానికి యోగ్యంగా ఉండేలా వా‍టిని ఆయనకు సమర్పించడం ప్రార్థన

Ø ప్రార్థన అంటేదేవున్ని బలవంతంగా మార్చే ప్రయత్నం కాదు. ఆయన చిత్తానికి అనుకూలంగా మనల్ని మనంఅంకితం చేయడమే

Ø ప్రార్థన దేవున్నితెలుసుకోవడానికి మనకు తోడ్పడుతుంది

Ø ప్రార్థన మనందేవునితో మాట్లాడటానికి, మనసు విప్పి ఆయనతో సంభాషించటానికి, మ‍న ఆత్మలోనిఆరాటాన్ని తెలిపి ఆయనలో లీనం కావడానికి దోహదం చేస్తుంది. 

Ø మోకరించే  క్రైస్తవుడు ఆయన్ని కనుక్కోగలుగుతున్నాడు: అదేసమయంలో దేవుడు అతన్ని కనుగొంటున్నాడు.

Ø ప్రార్థన ద్వారా మనఆత్మ దైవ సన్నిధిలో సన్నిహితత్వం పొందుతుంది.

Ø దేవున్నిదర్శించడమే ప్రార్థన.  దైవ దర్శనం లేనిప్రార్థన వ్యర్థం.

Ø మన అవసరాలనుదేవునికి తెలపడం ప్రార్థనలోని ప్రాముఖ్య అంశం

Ø ఆయనలో గాఢంగా  కలిసిపోవడమే నిజమైన ప్రార్థన.

Ø హృదయమంతటితో,బలమంతటితో ప్రార్థించడం క్రైస్తవులు ఈ భూమిపై సాధించగలిగిన అంతిమ మహా విజయం .

Ø పరిశుద్ధాత్ముడుప్రార్థనలో మనకు సహాయకుడు.

Ø ప్రార్థన మనకున్నఆధిక్యతలన్నిటిలోకి అత్యున్నతమైనది.

Ø మనబాధ్యతలన్నిటిలోకి అతి గంభీరమైనది. మన చేతుల్లో పెట్టిన మహోన్నత శక్తి ప్రార్థన.

Ø దేవుని ధననిధితలుపు తెరిచే తాళం చెవి ప్రార్థనే.

మనము ఎవరికి ప్రార్థన చేయాలి?

మనము యేసునామములో  తండ్రి  యైన దేవునికి  ప్రార్ధన  చేయవలెను (యోహను  14:13, 14:16,23, యాకోబు1:5) మరియమ్మకు గానీ, పరిశుద్ధుకు గానీ, విగ్రహములకు గానీ ప్రార్థించకూడదు.

మనము ఎందుకు ప్రార్థన చేయాలి?

     మనము దేవుని  సహవాసము కొరకు

     పరిశుద్ధముగా జీవించుట కొరకు,

     పాపక్షమాపణ కొరకు,

     మన అవసరతల కొరకు,

     పాపములో పడకుండా దేవుని కృపను పొందుట కొరకు

     ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి

మనము ప్రార్థన ఎలా చేయాలి ?

     విశ్వాసముతో, పట్టుదలతో (యాకోబు 1:5,6)

     విరిగి నలిగిన శుద్ధ హృదయముతో (కీర్తన 51:17; 68:18)

     పరిశుద్ధాత్మలో ప్రార్థించండి (యూదా 21)

మనము ఏ సమయంలో ప్రార్థన చేయాలి?

     వేకువ జామున  (మార్కు  1:35)

     మద్యాహ్నము   (అపొ.కార్య.3:1  10:9

     రాత్రివేళ           (లూకా  6:12)

     భోజనముచేయునపుడు(యోహాను6:11)

     శ్రమలకా లములో         (యాకోబు 5:13

     ఆపత్కాలములో  (కీర్తనలు  50:15)

     అనారోగ్యములో  (యాకోబు 5:14)

     నిత్యము ప్రార్థన చేయవలెను(లూకా  18:1)

 

మనము ఎప్పుడు ప్రార్థన చేయాలి?

     మనో విచారములో ఉన్నపుడు      -యోహాను 14

     మనుషులు మోసగించినపుడు      -కీర్తన 27

     ఫలభరితమైన జీవితం కొరకు        -యోహాను 15

     పాపము చేసినపుడు                -కీర్తన 51

     ఆందోళనకు లోనైనపుడు            -మత్తయి 6: 19-34

     అపాయము ఉన్నపుడు            -కీర్తన  91

     దేవుడు లేడు అనుకున్నపుడు      -కీర్తన 139

     విశ్వసము సడలినపుడు   -హెబ్రీ 11

     ఒంటరితనంతో భయభ్రాంతులయినపుడు - కీర్తన 23

     చేదైనఅనుభవాలతో క్లిష్ట పరిస్థితులలో ఉన్నపుడు – 1 కొరింథి 13

     సంతోషకరమైన హృదయం కొరకు – కొలస్సీ 3:12 - 17

     క్రైస్తవ్యమును సరిగా అర్థంచేసుకొనుటకు - 2 కొరింథి 5: 15-19

     నిరాశలో ఉన్నపుడు – రోమా 8:31

     శాంతి, సమాధానముల కొరకు      మత్తయి11:25-30

     ప్రపంచం దేవునికంటే పెద్దదిగా కనిపించినపుడు కీర్తన 90

     క్రీస్తునందు గట్టి నమ్మకం కొరకు - రోమా 8:1-30

     నీ ప్రార్థన స్వార్థపూరితమైనపుడు  - కీర్తన 67

     పనిలో ధైర్యం కొరకు – యెహోషువ 1

     సహచరునితో సహవాసం కొరకు – రోమా 12

     నిరుత్సాహంలో ఉన్నపుడు          -కీర్తన 27

     పేదరికంలో ఉన్నపుడు – కీర్న 37

     ప్రేమ లోపించినపుడు – 1కొరింథి 13

     దయ లోపించినపుడు      -యోహాను 15

     పనిలో నిరుత్సాహపడినపుడు – కీర్తన 126

     భయములో ఉన్నపుడు – కీర్తన 34:7

     దేవుడు నీకు తోడై ఉన్నాడన్న నిశ్చయత కొరకు – కీర్తన 145:18

     పరిశుద్ధమైన జీవితం కొరకు         -

 మనము ఎక్కడ ప్రార్థన చేయాలి?

     ఒంటరిగా గదిలో  లేక  ఏకాంతముగా (మత్తయి 6.6; యెహెజ్కేలు  3:22)

     ఇంటిలో      (అపొ. కార్య.  12:12)

     మందిరములో(అపొ.కార్య  4:31)

     గుంపులో  మనము  ప్రార్దన చేయాలి  (అపొ.కార్య.  1:14) 

 

ప్రార్థనలో అడుగుట:

 

ü దేవునిజ్ఞానాన్నిబట్టి అడగాలి        మత్తయి 6:8

ü దేవునిఅంగీకారాన్నిబట్టి అడగాలి   లూకా 11:11-13

ü దేవుని ప్రేమనుబట్టి అడగాలి       యోహాను 16:23-27

ü క్రీస్తునందునిలిచి అడగాలి          యోహాను 15:7

ü విశ్వాసంతో అడగాలి                 యాకోబు 1:5,6

ü ఆజ్ఞలు పాటిస్తూఅడగాలి            1 యోహాను 3:22

ü దేవునిచిత్తానుసారంగా అడగాలి    1 యోహాను 3:22

ü గట్టి నమ్మకంతోఅడగాలి            మత్తయి 21:22

ü నిస్వార్థంగాఅడగాలి                 యాకోబు 4:2,3

ü క్రీస్తు నామంలోఅడగాలి             యోహాను 15:16

 

మనము ప్రార్థన ఎంతవరకు చేయాలి?

  మనము మన ప్రార్దనకు జవాబు వచ్చునంత  వరకు  ప్రార్దన చేయాలి.  ఎంత సమయము  ప్రార్దించామన్నది  ముఖ్యం కాదు  గాని,   ఎంత ఆసక్తితో  ప్రార్దించామన్నదే  ముఖ్యము

 మనము చేసే ప్రార్థనలన్నిటికీజవాబు వస్తుందా?

మనము  చేసిన  ప్రతి ప్రార్దనకు జవాబు  వచ్చును

     అయితే అవును – వద్దు –కనిపెట్టు  అను  జవాబులలోఏదో ఒకటి  వచ్చును. దావీదు  అమాలేకీ యులను తరిమిన  యెడల  వారిని కలిసికొందునా?  అని  అడిగినప్పుడు దేవుడు  తరుము  నీ వారిని  దక్కించుకొందువనెను (1సమూయేలు   30:8)                                                                                                         

     బిలాము బాలాకు  రాజు  పిలుపును అంగీకరించి  శ్రాయేలీయులను శపించుటకు  వెళ్ళుదును అన్నప్పుడు  దేవుడు  వద్దు అనెను (సంఖ్యా 22:10-12)                                                                                                           

     అబ్రాహాము  తన సంతానమును  గురించి  వాగ్దానము పొందినప్పటికి  దాని నెరవేర్పుకొరకు  కనిపెట్టవలసి వచ్చెను (ఆది  15:4;   21: 1,2)

 

మన ప్రార్థనలో ఏమి ఉండాలి?

     మోకాళ్ళూని, కన్నులు మూసికొని చెడ్డసంగతులు గాని మంచి సంగతులుగాని తలంపక క్రీస్తు ప్రభువునే తలంచుకొనవలెను. (యోబు11:13, కీర్తన 57:7, హెబ్రి 12:2)

     మ‍న పాపములు, బలహీనతలు ఒప్పుకొనుట ఉండాలి. తలంపులోను, మాటలోను క్రియలోను గలపాపములను ఒప్పుకోవాలి. (కీర్తన 32:5, యోహాను 1:9

     నాకు తెలిసిన పాపములు ఇకమీదటచేయకుండుటకు ప్రయత్నము చేసెదనని చెప్పాలి (కీర్తన 119:112, నెహెమ్యా 10:29,32)

     నాకు కలిగియున్న శరీరమును, ప్రాణమును,ఆత్మను, నా సమస్తమును నీ స్వాధీనము చేయుచున్నానని చెప్పవలెను (ఆది 22:2, రోమా 12)

     స్తుతి,  కృత జ్ఞతలు  చెల్లించుట ఉండాలి, క్రీస్తు ప్రభువు తొలగించని కష్టములను, తొలగించిన కష్టములను,ప్రభువు చేసిన మేళ్ళను తలంచుకొని ఆయనను స్తుతించవలెను. ఆయన దివ్య లక్షణములను తలంచిస్తుతించవలెను (కీర్తన 107:2, 19-21, ప్రకటన 15:3,4)

     మన అవసరతలు కోరికలన్నియు చెప్పుకొనిఅడగవలసినవన్నియు అడగవలెను. (యోహాను 14:14, యెషయా 65:24)

     ఇతరులకొరకు విజ్ఞాపన చేయుట ఉండాలి

     ఆపై దేవుని ఆత్మ నడిపింపు ననుసరించి అనేక విషయముల కొరకు మనముప్రార్థించాలి

     జవాబు కొరకు కనిపెట్టవలెను. కీర్తన37:7, యెషయ 40:31

మనము ప్రార్థించుట వలన ఫలితమేమి?

     ప్రార్దన  ద్వారా  మనము దేవుని  స్వరమును  వినగలము

     మన  హృదయము  దేవుని హృదయముతో  కలియును

     మన  శారీరక, మానసిక  ఆద్యాత్మిక  అవసరతలు తీరును

     మన  పాపములు  క్షమింపబడును

     ఆధ్యాత్మిక  బలము  పొందెదము

     సాతాను  శోధనలను  జయించగలిగెదము

     దేవుని  చిత్తమును  తెలుసుకొన గలుగుదుము    (యెహోను   8:29)

     ఆధ్యాత్మికమర్మములను  గూఢమైన  సంగతులను  గ్రహించుకో గలుగుదుము  (యిర్మీయా   33:3)

     దేవునితో  సహవాసము  కలిగి ఆయనతో  నడిచే  అనుభవాన్ని పొంద  గలుగుదుము.

     దురాత్మలప్రభావము  నుండి  విడిపించబడుదుము

     దేవుని  అద్భత  కార్యములు  స్వస్ధతలు  చూచెదము

     దేవుని  వాగ్దానములను  సంపాదించుకొని ఆదరణ  పొందుదుము

     ప్రార్దన  వలన  రూపాంతర అనుభవాన్ని  పొంది  పరిశుద్ధపరచబడుదుము

     ప్రార్థిస్తే ఎంతటి గొప్ప సమస్యనైనా దేవుడు పరిష్కరిస్తాడు.

     ప్రార్థన వలన క్రమము, మర్యాద, చురుకుదనము, శుద్ధి, విశ్వాసము, ధైర్యము,పవిత్రత,     ఐక్యత, ప్రేమ, నీతి, భక్తి,అలవడతాయి.

 

మన ప్రార్థనా జీవితమునకు ఆటంకములు ఏవి?

పాపము:  మన పాపములను ఒప్పుకోవాలి. (కీర్తన 66:1, యోహాను 1:8,9)

అవిశ్వాసము:  మనము విస్వాసము పొందుటకు దేవుని వాక్యమును వినాలి, చదవాలి, ధ్యానించాలి.యాకోబు 1:6, రోమా  10: 14-17

గర్వము: మనలను మనముతగ్గించుకోవాలి. 1  పేతురు  5:5,6

స్వార్థము: మనము స్వార్థమువిడిచి , దేవుని చిత్తములో ప్రార్థించాలి.  యాకోబు 43:3

విస్తారమైన పని : ప్రతి దినము ఒకప్రత్యేకమైన స్థలములో ప్రత్యేకమైన సమయమును దేవుని సన్నిధిలో  గడపటానికి నిర్ణయించాలి లూకా 10:41

సోమరితనము :  వేకువజామున నిద్రలేచి ప్రార్థించాలి . యోనా 1:6, సామెతలు 6:6, మార్కు 1: 35

తోటివారితో సరిగా  లేకపోవడం: మన హృదయమును సరిచేసుకోవాలి మత్తయి: 5:23,24

నిద్రమత్తు:   భయ  భక్తులతో  మెకాళ్ళమీద నిలబడి  చేతులు  పైకెత్తి బిగ్గరగా  ప్రార్ధించినచో  నిద్రమత్తును జయించగలము    (1 తిమోతి  2:8)

చెదరిన తలంపులు:  మనసులోనే  ప్రార్ధించినపుడు  మన తలంపులు  చెదరి  పోవడానికి అవకాశమున్నది  కాని  బగ్గరగా ప్రార్ధంచినచో  మన  ప్రార్ధింనను మనము  వింటాము  కాబట్టి మన  తలంపులు  చెదరిపోవడానికి  అవకాశము లేదు

ఆటంకములు:  ఆటంకములను  జయించుటకు  ఒక ప్రత్యేకమైన  సమయం  ఒక ఏకాంత  స్ధలము  నిర్ణయించుకొని  ఆ స్ధలంలో  ఆ  సమయమునందు మనమున్నప్పుడు  ఇతరులు  మనము ప్రార్ధనలో  యున్నామని  గ్రహిస్తారు గనుక  నీవు  ప్రార్ధన చేయునపుడు  నీ  గదిలోనికి వెళ్లి  తలుపులు  వేసి రహస్యమందున్న  నీ  తండ్రికి ప్రార్ధన  చేయుము (మత్తయి   6: 6)

ఉపవాసము అనగా ఏమిటి: 

‘ఉ’ అంటే ఉపేక్షంచుకొనుట;

‘ప’ అంటే పరీక్షించుకొనుట;

‘వా’ అంటే వాక్యము ధ్యానించుట; 

‘స’ అంటే సమర్పించుకొనుట;

‘ము’ అంటే ముక్తిని చేరుట అని ఒకరన్నారు!

ఉపవాసము  ఒక  శక్తివంతమైన ఆధ్యాత్మిక  క్రమశిక్షణ! 

మనం ఎందుకు ఉపవాస ప్రార్థన చేయాలి?

ఉపవాసముండి ప్రార్ధించుట ద్వారా  పరిశుద్ధాత్ముడు  మన  జీవితాలను  రూపాంత రీకరిస్తాడు  ఉపవాస ప్రార్ధన  ఉజ్జీవానికి  మూలము! ఉపవాస  ప్రార్ధన  మన జీవితాలకు,  సంఘాలకు,  సమాజాలకు కూడా  స్వస్ధత  చేకూరుస్తుంది.  ఉపవాస ప్రార్ధన  శక్తినిస్తుంది.  పునరుజ్జీవాన్ని  కలుగజేస్తుంది.  దేవుని సన్నిధిలో  నిన్ను  నీవు తగ్గించుకొనుటే  నిజమైన  ఉపవాసము!    (కీర్తన    35:13  ; ఎజ్రా   8:21)

బైబిలులో ఉపవాసప్రార్థన చేసినవారు ఎవరు?              

ఇశ్రాయేలీయులు  (న్యాయాధి 20:26;1సమూయేలు  7:5,6)

దావీదు                                 (llసమూయేలు 3:35 ; కీర్తనలు 35:13;   69:10;109:24)

అహాబు                                  (1  రాజులు 21:27 – 29) 

ఎజ్రా                                      (ఎజ్రా 8:21 – 23)                 

నెహెమ్యా                           (నెహెమ్యా 1:4)

యూదావారు                  (నెహెమ్యా 9: 1-37)

ఎస్తేరు,  మొర్దెకై                 (ఎస్తేరు 4: 1 – 16)

దానియేలు                     (దానియేలు    9: 1-3)

నీనెవెవారు         

Monthly News letter

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on May 10, 2011 at 2:27 AM Comments comments (0)

ప్రేమస్వరం

ముందుమాట                                                      

ప్రేమస్వరం అనుఈ  ఆధ్యాత్మిక మాసపత్రిక సంఘమును ప్రభువురాకడకు సిద్ధపరచాలనే సంకల్పంతో ప్రేమ స్వరూప్‌ మినస్ట్రీస్‌ ద్వారా ప్రతి నెలప్రచురించబడు చున్నది. ఈ దినములలో ఆత్మ సంఘములకు ఏమిసెలవిచ్చుచున్నారో దానికి ప్రవాహకులముగా మేము ఉండగోరుచున్నాము. అంత్యదినములలో  దేవుడు తన ఆత్మను ప్రపంచ మంతటి మీదకుమ్మరించి తన సంఘమును తన కుమారునిలో పరిపూర్ణముగా చేయగోరుచున్నాడు. ఈ పత్రికద్వారా పరిశుద్దాత్మ యొక్క పూర్ణ కార్యములను వివరించుచూ క్రీస్తును చూపించప్రయత్నంచుచున్నాము. ఈ దినములలో దేవుడు తన సంఘమును సత్య నిర్లక్ష్యతనుండి తప్పించి  తిరిగి ఆ మొదటి శక్తితో నింపగోరుచున్నాడనినమ్ముచున్నాము. మనలోకొందరు ‘పైకి భక్తి గల వారి వలెఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు’ (2తిమోతి 3:5)ఒకవిశ్వాసిలో నుండి ప్రార్థనాశక్తి, దేవుని మహిమ, పరిశుద్ధాత్మప్రభావము ప్రవహించకపోతే వారి భక్తి వ్యర్థమే,  ప్రార్థించేవారు పాపము చేయలేరు, పాపములోఉన్నవారు ప్రార్థన చేయలేరు. ప్రార్థనద్వారా మనం ఉన్నతమైన ఆత్మీయ అనుభవం లోనికి నడిపించ బడతాం, ఆత్మీయ పరిపక్వత కలిగి, దేవుడిచ్చిననూతన బలముతో  అలయక, సొమ్మసిల్లక ముందుకుసాగిపోతూ, ఆత్మ ఫలములు ఫలిస్తూ, కృపావరములతో నింపబడి  దేవుని మహిమ కొరకు మాత్రమే జీవిస్తూ, రాకడకుసిద్ధపడుతూ, అనేక మందిని సిద్ధపరుస్తూ, ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగాఉండాలనేది నీ యెడల దేవుని చిత్తమై ఉన్నది. తన మహిమగల సంఘము నిమిత్తము ప్రభువు వచ్చు చున్నాడు. రాకడ కొరకుసిద్ధపడుటకు ప్రార్థించండి.  ఈ పత్రికను ప్రతి ఒక్కరు చదివి ఆత్మీయఆశీర్వాదములు పొందవలెనని ప్రభువు నందు మా ముఖ్య లక్ష్యమై యున్నది.

మన వ్యక్తిగత సాక్ష్యమును కాపాడుకుంటూ, దేవుడుమనలను పిలిచిన పిలుపుకు తగినట్టు జీవిస్తూ, ఇతరులకు మార్గదర్శకంగా ఉందాం. మన ప్రవర్తనవలన దేవుడు మాత్రమే మహిమ పరచబడాలి. హల్లెలూయ !!!

మీ బంధువులు, మీ ఇరుగు పొరుగువారు, మీగ్రామస్తులు, మీ నాయకుల కొరకు ఎడతెగక ప్రార్థించండి. అడుగుడి మీకు ఇవ్వబడును అనివాగ్ధానము చేసిన ప్రభువు మన ప్రార్థన ఆలకించి మన గ్రామానికి రక్షణానందమునుఅనుగ్రహిస్తాడు. దయచేసి మీ ప్రార్థన అవసరతలను ఉత్తరాలద్వారా గాని, ఇ మెయిల్‌ద్వారా గాని, ఫోన్‌ ద్వారా గాని తెలియజేయండి. మీ కొరకు ప్రత్యేకముగాప్రార్థించడానికి పరిశుద్ధాత్మచే అభిషేకింపబడిన ప్రార్థనా యోధులు ఎల్లపుడూసిద్ధముగా ఉన్నారు. రండి ! అందరం కలిసి దేవుని రాజ్యాన్ని ఆయన మహిమ కొరకునిర్మిద్ధాం !!! 

దైవాశీర్వాదములు  మీపై సమృద్ధిగా కుమ్మరింపబడును గాక ! ఆమెన్‌. ప్రేమతో … ప్రభువునందు మీ  – డా. యస్‌. చంద్రకిరణ్‌ PhD

సంపాదకులు : శ్రీమతి. యస్‌. మంజు కిరణ్‌ MBA

గౌరవ సంపాదకులు : రెవ. డా. జి. విశ్వనాధం పాల్‌ PhD 

.

ఎడిటోరియల్‌ బోర్డు

                              

 బ్రదర్‌. జి. విజయ్‌కుమార్‌ MCA          బ్రదర్‌ ఎన్‌. చిట్టిబాబు  MBA, B. Ed      

 శ్రీమతి యస్‌. మార్తమ్మ                 శ్రీమతి మార్గరెట్‌ పాల్‌ M.AB. Ed

 కుమారి శాంతిస్వరూప M. Tech            శ్రీమతిబ్యూలా విక్టర్‌ M.A

 బ్రదర్ వై. థామస్‌ B.A                    బ్రదర్‌ టి. శ్రీనివాస్‌ పాల్‌ B.COM

 

 

V  MAY GOD BLESS YOU LIKE NEVER BEFORE  V


PRAYER TOWER

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on May 10, 2011 at 2:21 AM Comments comments (0)

రండి!                              దేవుని సన్నిధిని అనుభవించండి                 ఆశీర్వదించబడండి

ప్రేమస్వరూపి ప్రార్థనగోపురం         

“ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టినిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగానేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని, నా దృష్టియు, నా మనస్సును నిత్యముదానిమీదనుండును”. (2 దిన .7:15,16)                                                                                                                                                                                                

­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­_______________________________________________________________________________________________                     

       

µ  అంతులేని మనోవేదనతో గుండె చెదిరి, హృదయ భారంతోకృంగియున్నారా?

µ  అంతు చిక్కని వ్యాధులతో పీడింపబడుతున్నారా?

µ  ఒంటరితనంతో విసిగిపోతున్నారా?

µ  నిరాశా, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారా?

µ  చదువులో వైఫల్యం చెందుతున్నారా?

µ  శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్నారా?

µ  వివాహము కాలేదని విచారిస్తున్నారా?

µ  కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా?

µ  పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, అప్పులతో అల్లాడుతున్నారా?

µ  సంతానము కలగలేదని కలత చెందుతున్నారా?

µ  ఉద్యోగం రాలేదని చింతిస్తున్నారా?

µ  వ్యాపారంలో నష్టాలను చవిచూస్తున్నారా?

µ  ఆత్మహత్య చేసుకోవాలనే తలంపులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా?

µ  దురాత్మలచే పీడించబడుతున్నారా?

µ  చేతబడి, మంత్రశక్తులతో బాధించబడుతున్నారా? 

µ  దురలవాట్లకు బానిసయ్యారా?

µ  ముక్తికొరకు మార్గమును వెదుకుతున్నారా?

µ  పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోని ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కొరకుఆకలిగొని ఉన్నారా?  

µ  దేవుడిచ్చే కృపావరములతో నింపబడి దేవుని మహిమ కొరకు జీవించాలనే అశకలిగిఉన్నారా?

µ  భక్తిలోని శక్తిని ఆశ్రయించే విశ్వాసవీరునిగా ఫలభరితమైన జీవితం కొరకుఆసక్తితో ఎదురుచూస్తున్నారా? 

 

  అయితే మీకో శుభవార్త ......

“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తజనులారా, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును” (మత్తయి11:28) అని ప్రేమామయుడైనయేసుక్రీస్తు ప్రేమతో మిమ్మల్నిఆహ్వానిస్తున్నాడు. ఆయనే మార్గమును, సత్యమును,జీవమునైయున్నాడు.

 రండి మీ దుఖఃదినములు సమాప్తమగును. కుంటివారు నడుస్తున్నారు,చెవిటివారు వింటున్నారు, క్యాన్సర్, ఎయిడ్స్ వంటి రోగులు స్వస్థపరచబడుతున్నారు. అనేకకుటుంబాలలో సంతోషం వెల్లివిరిసింది. విడిపొయిన కుటుంబాలు కలిశాయి, సంతానంలేనివారు  బిడ్డలతో సంతోషంగా ఉన్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి విశ్వాసముతో రండి ... నమ్ముట నీవలనైతేనమ్మువానికి సమస్తము సాధ్యము  అని యేసయ్యఅభయమిస్తున్నాడు. రండి ఆయన సన్నిధిలో లభించే  ప్రేమ, సంతోషము, శాంతి, సమాధానము, ఆదరణ, ధైర్యం, పవిత్రత, నిండుతనం, శక్తి, ఆరోగ్యం, సమృద్ధితో కూడిన  పరిశుద్ధాత్మ దేవుని అద్భుత కార్యములనురుచిచూడండి.

 

ప్రార్థనలద్వారా మీ కష్టాలన్నీ సుఖ సంతోషాలుగా మారుతాయి. యేసు ప్రభువుఆశ్వీర్వాదాలతో మీ జీవితం ధన్యం కావాలని,  మీరుఅన్నివిధాలుగా దేవుని అద్భుతాలు పొందాలని, మీ కన్నీరు తుడవబడి మీజీవితం ఆనందమయం కావాలని, సుఖశాంతులతో వర్ధిల్లాలని  ఇచట ప్రార్థిస్తున్నాము.

 

నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలముగలదై యుండును  (యాకోబు 5:6) కనుక మహోన్నతుడు, సర్వోన్నతుడు,సర్వశక్తిమంతుడు, కృపాసత్య సంపూర్ణుడు, ప్రేమామయుడైన యేసుక్రీస్తు ప్రభువు మన మధ్యలోఉన్నాడు.  ఆయనకు అసాధ్యమైనదేదియు లేదు. మీఅక్కరలను ఎరిగిన దేవుడు మీకు మీ అవసరాలను తప్పక తీరుస్తాడు.  

 

శ్రమలోనున్న మానవాళికి ఈ   ప్రార్థనాగోపురం ఓ ఆశాకిరణం!

 

ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చే ఆత్మీయ, శారీరక స్వస్థతల కొరకు నేడే రండిపరిశుద్ధాత్మతో నింపబడిన  ప్రార్థనాయోధులుమీకొరకు ప్రార్థించుటకు అన్నివేళలా సిద్ధముగా ఉన్నారు. సహాయము కొరకు  ప్రార్థనాగోపురమును వెంటనే సంప్రదించండి.

గమనిక:  మీ సమస్యలు గోప్యముగా ఉంచబడును.

 

వివరాలకు:

డా. యస్. చంద్రకిరణ్ (MA, M. Phil, PhD),

ప్రేమస్వరూప్మినిస్ట్రీస్, పుంగనూరు, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. 517247

ఫోన్‌  : 9703311304,8142971747, E - Mail: [email protected]

 Website:http//www.premswaroopministries.webs.com/

మీ కొరకు ప్రార్థించువారు...

రెవ.డా.జి.విశ్వనాధం పాల్ , ఎన్‌.చిట్టిబాబు, జి. విజయ్‌కుమార్‌, వై. ధామస్, టి.శ్రీనివాస్‌, కుమారి సి.హెచ్‌. శాంతి స్వరూప,

శ్రీమతి మంజు కిరణ్‌, శ్రీమతి బ్యూలావిక్టర్‌, మదర్‌ మార్తమ్మ, మదర్‌ మరియమ్మ, పాస్టర్‌ రెబ్కమ్మ, శ్రీమతి మార్గరెట్‌పాల్‌,

కుమారి ఎమ్‌. మెర్సి, బ్రదర్‌ ఎమ్‌.వినయ్‌ కుమార్‌

 

దేవుడు  మిమ్మును  బహుగా ఆశీర్వదించి  సర్వసమృద్ధిలోనికి  నడిపించునుగాక!!!

 

 


PRAYER TOWER

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on May 10, 2011 at 2:21 AM Comments comments (0)

రండి!                              దేవుని సన్నిధిని అనుభవించండి                 ఆశీర్వదించబడండి

ప్రేమస్వరూపి ప్రార్థనగోపురం         

“ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టినిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగానేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని, నా దృష్టియు, నా మనస్సును నిత్యముదానిమీదనుండును”. (2 దిన .7:15,16)                                                                                                                                                                                                

­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­_______________________________________________________________________________________________                     

       

µ  అంతులేని మనోవేదనతో గుండె చెదిరి, హృదయ భారంతోకృంగియున్నారా?

µ  అంతు చిక్కని వ్యాధులతో పీడింపబడుతున్నారా?

µ  ఒంటరితనంతో విసిగిపోతున్నారా?

µ  నిరాశా, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారా?

µ  చదువులో వైఫల్యం చెందుతున్నారా?

µ  శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్నారా?

µ  వివాహము కాలేదని విచారిస్తున్నారా?

µ  కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా?

µ  పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, అప్పులతో అల్లాడుతున్నారా?

µ  సంతానము కలగలేదని కలత చెందుతున్నారా?

µ  ఉద్యోగం రాలేదని చింతిస్తున్నారా?

µ  వ్యాపారంలో నష్టాలను చవిచూస్తున్నారా?

µ  ఆత్మహత్య చేసుకోవాలనే తలంపులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా?

µ  దురాత్మలచే పీడించబడుతున్నారా?

µ  చేతబడి, మంత్రశక్తులతో బాధించబడుతున్నారా? 

µ  దురలవాట్లకు బానిసయ్యారా?

µ  ముక్తికొరకు మార్గమును వెదుకుతున్నారా?

µ  పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోని ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కొరకుఆకలిగొని ఉన్నారా?  

µ  దేవుడిచ్చే కృపావరములతో నింపబడి దేవుని మహిమ కొరకు జీవించాలనే అశకలిగిఉన్నారా?

µ  భక్తిలోని శక్తిని ఆశ్రయించే విశ్వాసవీరునిగా ఫలభరితమైన జీవితం కొరకుఆసక్తితో ఎదురుచూస్తున్నారా? 

 

  అయితే మీకో శుభవార్త ......

“ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తజనులారా, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును” (మత్తయి11:28) అని ప్రేమామయుడైనయేసుక్రీస్తు ప్రేమతో మిమ్మల్నిఆహ్వానిస్తున్నాడు. ఆయనే మార్గమును, సత్యమును,జీవమునైయున్నాడు.

 రండి మీ దుఖఃదినములు సమాప్తమగును. కుంటివారు నడుస్తున్నారు,చెవిటివారు వింటున్నారు, క్యాన్సర్, ఎయిడ్స్ వంటి రోగులు స్వస్థపరచబడుతున్నారు. అనేకకుటుంబాలలో సంతోషం వెల్లివిరిసింది. విడిపొయిన కుటుంబాలు కలిశాయి, సంతానంలేనివారు  బిడ్డలతో సంతోషంగా ఉన్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి విశ్వాసముతో రండి ... నమ్ముట నీవలనైతేనమ్మువానికి సమస్తము సాధ్యము  అని యేసయ్యఅభయమిస్తున్నాడు. రండి ఆయన సన్నిధిలో లభించే  ప్రేమ, సంతోషము, శాంతి, సమాధానము, ఆదరణ, ధైర్యం, పవిత్రత, నిండుతనం, శక్తి, ఆరోగ్యం, సమృద్ధితో కూడిన  పరిశుద్ధాత్మ దేవుని అద్భుత కార్యములనురుచిచూడండి.

 

ప్రార్థనలద్వారా మీ కష్టాలన్నీ సుఖ సంతోషాలుగా మారుతాయి. యేసు ప్రభువుఆశ్వీర్వాదాలతో మీ జీవితం ధన్యం కావాలని,  మీరుఅన్నివిధాలుగా దేవుని అద్భుతాలు పొందాలని, మీ కన్నీరు తుడవబడి మీజీవితం ఆనందమయం కావాలని, సుఖశాంతులతో వర్ధిల్లాలని  ఇచట ప్రార్థిస్తున్నాము.

 

నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలముగలదై యుండును  (యాకోబు 5:6) కనుక మహోన్నతుడు, సర్వోన్నతుడు,సర్వశక్తిమంతుడు, కృపాసత్య సంపూర్ణుడు, ప్రేమామయుడైన యేసుక్రీస్తు ప్రభువు మన మధ్యలోఉన్నాడు.  ఆయనకు అసాధ్యమైనదేదియు లేదు. మీఅక్కరలను ఎరిగిన దేవుడు మీకు మీ అవసరాలను తప్పక తీరుస్తాడు.  

 

శ్రమలోనున్న మానవాళికి ఈ   ప్రార్థనాగోపురం ఓ ఆశాకిరణం!

 

ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చే ఆత్మీయ, శారీరక స్వస్థతల కొరకు నేడే రండిపరిశుద్ధాత్మతో నింపబడిన  ప్రార్థనాయోధులుమీకొరకు ప్రార్థించుటకు అన్నివేళలా సిద్ధముగా ఉన్నారు. సహాయము కొరకు  ప్రార్థనాగోపురమును వెంటనే సంప్రదించండి.

గమనిక:  మీ సమస్యలు గోప్యముగా ఉంచబడును.

 

వివరాలకు:

డా. యస్. చంద్రకిరణ్ (MA, M. Phil, PhD),

ప్రేమస్వరూప్మినిస్ట్రీస్, పుంగనూరు, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. 517247

ఫోన్‌  : 9703311304,8142971747, E - Mail: [email protected]

 Website:http//www.premswaroopministries.webs.com/

మీ కొరకు ప్రార్థించువారు...

రెవ.డా.జి.విశ్వనాధం పాల్ , ఎన్‌.చిట్టిబాబు, జి. విజయ్‌కుమార్‌, వై. ధామస్, టి.శ్రీనివాస్‌, కుమారి సి.హెచ్‌. శాంతి స్వరూప,

శ్రీమతి మంజు కిరణ్‌, శ్రీమతి బ్యూలావిక్టర్‌, మదర్‌ మార్తమ్మ, మదర్‌ మరియమ్మ, పాస్టర్‌ రెబ్కమ్మ, శ్రీమతి మార్గరెట్‌పాల్‌,

కుమారి ఎమ్‌. మెర్సి, బ్రదర్‌ ఎమ్‌.వినయ్‌ కుమార్‌

 

దేవుడు  మిమ్మును  బహుగా ఆశీర్వదించి  సర్వసమృద్ధిలోనికి  నడిపించునుగాక!!!

 

 


బైబిలు నిబంధనలు

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on February 4, 2011 at 11:46 AM Comments comments (0)
బైబిలు నిబంధనలు (Bible Covenants)      

1. పరిచయం

2. ఏదేను నిబంధన

3. ఆదాము నిబంధన

4. నోవహు నిబంధన

5. అబ్రహాము నిబంధన

6. మోషే నిబంధన

7. పాలస్తీనా నిబంధన

8. దావీదు నిబంధన

9. నూతన నిబంధన

పాఠము – 1

పరిచయం

నిబంధన అనగా

A) ఒక నిర్దిష్టమైన నిబంధన/ఒప్పందము

B) బైబిలు కూడా నిబంధన గ్రంథముగా పిలవబడి రెండుగా విభజించబడి పాత నింబంధన మరియు నూతన నిబంధనగా పరిగణింపబడింది.

C) హిబ్రు, గ్రీకు భాషలలో ఈ పదాలు వాడబడ్డాయి.

D) బైబిల్లో నిబంధనలు మనుష్యులకు, మరియు దేవునికి మధ్య మరియు దేవునికి మనుష్యులకు మధ్య జరిగాయి.

1. మనుష్యులకు నిబంధనలు: యోనాతాను మరియు దావీదు 1 సమూయేలు 18:1-4, 19:1,2, 20:4,8,14,15,17,23,42 23:18, 2 సమూయేలు 4:1-4, 9:1-13.

2. దేవునికి మనుష్యులకు మధ్య నిబంధన:

a) ఏదేను - ఆది 1-2

b) ఆదాము - ఆది 3

c) నోవా - ఆది 6-9

d) అబ్రహాము - ఆది 12-22

e) మోషే - నిర్గమ 19-40

f) పాలస్తీనా - ద్వితీయోప 27-33

g) దావీదు - 2 సమూ 7, 1 దిన 17, కీర్తనలు 89, 132

h) నూతన - యిర్మియా 31:31-34, హెబ్రి 8, మత్తయి 26

II నిబంధనకు ఏర్పరచినవారు

A. దేవుడు

1. దేవుడు నిబంధనలను ఏర్పరచి మనిషికి అందజేశాడు

2. దేవుడిచ్చిన నిబంధనలు మనిషి అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు కానీ మార్చడానికి వీలులేదు

3. ఈ నిబంధనలద్వారా దేవునియొక్క గొప్ప ప్రేమ, కనికరం మరియు ఆయన కృప మానవులయెడల ఏమై ఉందో అర్ధమగుచున్నది.

B. ఈ నిబంధనలు ప్రారంభించిన దేవుడు నాలుగు విషయాలను చేశాడు

1. స్థిరపరచాడు Establishes it : మానవుని ఇచ్ఛాడు

2. Keeps it ఇచ్చిన తరువాత మరచిపోక మీరిపోక ఉన్నవాడు

3. ప్రత్యక్షపరచువాడు Reveals it: వాగ్దానములను, విషయాలను బహిర్గతంగా తెలియజేయును

4. మానవులను పాటించేటట్లు చేయువాడు Enables man to keep it: దేవుని సహాయం లేక మానవుడు పాటించుట అసాధ్యము

III. నిబంధన ఎందుకు?

A.

B. ఈ నిబంధనలో పాల్గొన్నవారు జీవితకాలము వరకు దానికి బద్ధులై ఉండాలి.

1. గమనిస్తే దావీదు మరియు యోనాతాను నిబంధన అలా కనిపిస్తుంది. దావీదు యోనాతాను కుమారుని విషయంలో నిశ్చయపరచాడు

2. వివాహవ్యవస్థను కూడా

C. దేవుడు మానవునితో నిబంధన చేయుటకు గల ఉద్ధ్యేశ్యము, ఆయన మానవుని యెడల తనకు గల ప్రణాళికలు జరిగించడానికే

1. దేవుడు చేసే ప్రతి పనికి ఒక ఉద్ధ్యేశ్యము ఉంటుంది.

2. ఆయన పని విషయంలో జాగ్రత్త అయిన ప్రణాళిక ఉంటుంది.

3. మానవుని పతనానికి ముందు, దేవుడు మానవుని సృష్టించడానికి గల కారణాన్ని నిబంధన ద్వారా తెలియజెశాడు. దానిని ఏదేను నిబంధన అన్నాము. ఆదాము దానిని తృణీకరించి ఆ నిబంధన విఫలమవ్వడానికి దోహదమైనాడు

4. అవి ఏవీ దేవుని ఆపజాలకపోగా దేవుడు విమోచన నిబంధనలు పరిచయం చేశాడు.

5. కాబట్టి సృష్టి నిబంధనలేకాక విమోచన నిబంధనలు ఆయన ఏర్పాటు చేశాడు.

IV. ప్రతి నిబంధన ఏమి కలిగి ఉంటాయి:

ప్రతి దైవ నిబంధనలో మూడు అంశాలు ఉంటాయి. వాక్యములు( Words), రక్తము (Blood), ముద్ర( Seal)

A. వాక్యములు లేదా వాగ్ధానములు

1. అవి పలుకబడినవి లేదా వ్రాయబడినవి

2. ప్రమాణములు

3. వాగ్ధానములు

1. దీవెనలు (Blessings)

2. శాపములు (Curses)

3. స్వాభావిక – తాత్కాలిక (Natural – temporal)

4. ఆత్మీయ – శాశ్వతమైన (Spiritual – eternal)

4. హద్దులు: ఈ హద్దుల ద్వారా ఈ నిబంధనలు నెరవేర్చబడతాయి

5. ప్రమాణము (Oath)

a) నిబంధన ప్రమాణంతో కూడినదైతే దానిని ఎంతమాత్రమూ మీరకూడదు

b) వాగ్దానాలు ప్రమాణపూర్వకంగా లేకపోతే దానిని మార్చివేయవచ్చు, లేదా తీసివేయవచ్చు.

ప్రమాణం మీరినట్లయితే, మీరినవ్యక్తి శాపగ్రస్తుడు.

B. రక్తము (Blood)

1. నిబంధన అనేది జీవమరణమునకు సంబంధించిన నిర్ణయము. అందునిమిత్తమే రక్తం చిందించడం అనేది అవశ్యమై యున్నది

2. రక్తం చిందించడం అనగా జీవితం ఫణంగా పెట్టడం

3. రక్తం చిందించడంలో బలి, మధ్యవర్తి మరియు బలిపీఠం ఉంటాయి.

a) బలి – రక్తం చిందించబడుట, శరీరం మరణించడం

b) మధ్యవర్తి – నిబంధనను స్థరపరచే వ్యక్తిత్వం (ప్రధాన యాజకుడు)

c) బలిపీఠం – నిబంధన స్థిరపరచే స్థలము (బలిపీఠం, దేవాలయము)

C. ముద్ర (Seal)

1. నిబంధన నిత్యం కొనసాగునట్లు సాక్ష్యం

2. వాగ్ధానములు, పద్ధతులు నిత్యం గుర్తుచేసే సాధనం.

D. దేవుడు మానవునితో చేసిన ప్రతి దైవ నిబంధనలో త్రిత్వము పనిచేస్తారు.

1. వాక్యము (Word) – తండ్రియైన దేవుడు నిబంధన ప్రారంభకుడు

2. రక్తము (Blood) – కుమారుడైన యేసు, మధ్యవర్తి యొక్క శరీర రక్తములు బలి యిచ్చువాడు

3. ముద్ర (Seal) – పరిశుద్ధాత్ముడు, నిబంధన సఫలము చేయువాడు

V. నిబంధనల కాలపరిమితి: దేవ నిబంధనలు తాత్కాలికమైనవిగా గాని, శాశ్వతమైనవిగా గాని ఉండవచ్చు

A. శాశ్వత నిబంధన:

1. కొన్ని దైవ నిబంధనలు శాశ్వతమైన నిబంధనలుగా కనబడతాయి. ఆది 9:16,17, 17:13, సంఖ్యా 25:10-13, 2 సమూయేలు 23:5, యెహెజ్కేలు 16:60, హెబ్రి 13:20

2. అయినప్పటికి ఈ వాగ్దానాలలో బలులు మరియు ముద్రలు కొన్ని లక్షణాలు శాశ్వతమైనవిగా ఉండక తాత్కాలిక స్వభావం కలిగి ఉంటాయి.

a. అబ్రహాము నిబంధన – శాశ్వత నిబంధన

b. జంతువుల బలి శాశ్వతమైనదికాదు.

B. అశాశ్వత నిబంధన – గలతీ 3:19, హెబ్రి 9:10

1. కొన్ని నిబంధనలు పరిమితం చేయబడ్డాయి.

2. మోషే నిబంధన

a) గుడారపు పరిచర్య, జంతుబలి, యాజకత్వము, పండుగలు అశాశ్వతమైనవి.

b) అయినప్పటికి ఆత్మీయ అర్థము మాత్రము నిత్యమైనది

C. అందు నిమిత్తమే మానవ ప్రమేయం లేకుండా దేవుడే వీటిని నెరవేర్చుచున్నాడు. మోషే నిబంధన – యిర్మియా 31:32, జకర్యా 11:10, 2 కొరింతీ 3:13, హెబ్రి 8:13

VI. ఈ నిబంధనా బాంధవ్యము ఎలా స్థిరపరచబడుతుంది?

A. ఈ ఒప్పందం నెరవేర్చడానికి ఇరువర్గాలు అర్థము చేసుకోవాలి.

B. పిలుపు ద్వారా (By Calling)

1. దేవుడు మానవున్ని పిలిచాడు – రోమా 8:28-30, 2 తిమోతి 1:19

2. దేవుడు తన అభీష్టానుసారం ఇస్తాడు. నెహెమ్యా 9: 7, 8, అ.కా 7: 1-18, హెబ్రి 11: 8-10, ఆది 12: 1-3

C. ప్రవేశం ద్వారా – By Entering

1. మానవుడు ఈ నిబంధనలోకి ప్రవేశించాలి. ద్వితీయో 29;1,12, 2 దిన 15:12, యిర్మియా 34:10.

2. మనిషి సంపూర్ణంగా ఈ నిబంధనలోనికి వెళ్ళి బాధ్యత తీసుకోవాలి.

a) ఇది విశ్వాసము మరియు విధేయతల ద్వారా హెబ్రి 11:8

b) ఇశ్రాయేలీయులు వాగ్ధనదేశంలోకి ఎందుకు ప్రవేశింపలేకపోయారు అంటే వారి అవిధేయత, అవిశ్వాసముల వలన మాత్రమే. హెబ్రి 3:4, లూకా 11:52, యోహాను 6:28,29

D. చేయడం ద్వారా – By Keeping

1. వాటిని గమనించి ఎల్లప్పుడు గుర్తు చేసుకోవాలి

2. దేవుడే దీనిని చేశాడు కీర్తన 111:5, ఆది 9:15,16

3. మానవుడు కూడా చేయాలి కీర్తన 103: 18

4. విశ్వాస విధేయత ద్వారా హెబ్రి 4:11, 5:9, ఆది 22:18, 26:5, నిర్గమ 19:5, ద్వితీయో 11:27, 30:6-8, యిర్మియా 7:22-28, 11:1-10, రోమా 5:12-21.

5. మానవుడు ఈ నిబంధనలను మీరిపోయే అవకశముంది. యిర్మియా 31:32, హెబ్రి 8:9.

VII. ఈ నిబంధనలు ఎలా పరస్పర సంబంధముగలవి / పరస్పర పూరకాలు

A. ప్రతి నిబంధన దేవుని మొత్తం ప్రణాళికలో భాగంగా ఉంటుంది. అంతేగాక అది వృద్ధి చెందుతూ ఉంటుంది.

B. మానవుడు పాపము చేయక మునుపు చేయబడినదే ఏదేను నిబంధన.

1. మానవుని సృష్టించడంలో దేవుని ఉద్ధ్యేశ్యము బయలుపరుస్తుంది.

2. మానవుని పతనస్థితి దేవుడు ముందే ఎరిగి సిద్ధపడియున్నాడు

3. విమోచన నిబంధన కార్యము ప్రారంభించాడు.

4. విమోచన నిబంధన ద్వారా సృష్టియొక్క నిబంధనను నెరవేర్చాడు.

C. ఆదాము – మానవజాతి పితరుడైన ఆదాముతో చేయబడి, మెస్సియా ద్వారా విమోచన తెలియజేయబడింది

D. నోవా – జలప్రళయం తర్వాత మానవుల జాతుల యొక్క పితరుడైన నోవాతో చేయబడి దేవుని యొక్క సృష్టి ఉద్ధ్యేశ్యమును నిర్ధిష్టపరచింది

E. అబ్రహాము – ప్రవచనాత్మకంగా ఇశ్రాయేలు ఏర్పాటు తెలియజేయడం ద్వరా మెస్సియా ఆగమనం గురించి తెలియజేయబడింది.

F. దావీదు – అబ్రహాము నిబంధనలో భాగంగా ఉండి అబ్రహాము నిబంధన ద్వారా రాజులును వాగ్ధానము చేయబడి, అనగా దావీదు కుమారడై, రాజులకు ఋఆజును, ప్రభువులకు ప్రభువును అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ నిబంధన నెరవేర్చబడుతుంది.

G. నూతన – అబ్రహాము వంశం ద్వారా భూమిమీద అన్ని జాతులు దీవించబడునట్లు అనగా అన్యులని, యూదులని బేధం లేక ఈ నిబంధన చేయబడింది.

H. ఏదేను వనంలో తెగిపోయిన బంధం తిరిగి ఏర్పడునట్లు ఈ విమోచన నిబంధనలు రూపొందించబడినాయి.

I. మోషే మరియు పాలస్తీనా నిబంధనలు ఇశ్రాయేలు దేశంతో ప్రత్యక్షంగా చేయబడిన నిబంధనలు.

1. మోషే నిబంధన ఇశ్రాయేలు ప్రజలయొక్క జీవితాలు, నైతిక (moral), పౌర (Civil) మరియు శుద్ధీకరణ నియమాలను వివరిస్తుంది.

2. పాలస్తీనా నిబంధన ఇశ్రాయేలు కానాను దేశమైన వాగ్ధాన దేశంలో నివశించినపుడు ఎటువంటి చట్టం, నిబంధనలు అనుసరించి జీవించాలో తెలియజేస్తుంది.

3. పై రెండు నిబంధనలు అబ్రహాము నిబంధనలో ముడిపడియున్నాయి.

a. మోషే నిబంధన అబ్రహాము సమతానమైన ప్రజలకు సంబంధించినది.

b. పాలస్తీనా నిబంధన అబ్రహాము నిబంధన ద్వారా వాగ్ధానము చేయబడిన దానిని గురించి చేయబడింది.

J. నూతన నిబంధన – ఈ చివరి నిబంధన ద్వారా ఏదేను నిబంధన పరిపూర్తి అవుతుంది.

 

 

 


PRAYER GARDEN

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on October 19, 2010 at 11:58 AM Comments comments (0)

WELCOME TO THE PRAYER GARDEN


( A PLACE YOU LEAVE REFRESHED )



A  JOURNEY, WE TRUST YOU WILL FINED EXITING AND INSPIRATIONAL TO YOUR PRAYER LIFE,  FINDING PEACE & REST, STRENGTH FROM OUR LOVING ALMIGHTY GOD, KING OF KINGS AND PRINCE OF PEACE JESUS CHRIST AND SOLACE FROM THE STROMS IN YOUR LIFE.  A PLACE YOU LEAVE REFRESHED


 

A Prayer Garden is a place of peace and serenity.


 

A Prayer Garden can be a place for spiritual communion with God. It's a place of meditation amidst nature's beauty.


 


Vision

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on May 14, 2010 at 4:12 AM Comments comments (0)

Dear beloved in Christ

Greetings to you in the precious name of our Lordand saviour Jesus Christ whom the honor and glory goes!!!

We started thisministry with a divine vision to heal millions of brokenhearted people through thematchless love and compassion of Jesus Christ. The ministry operates with adedicated mission. “Pray for all people of all nations and all backgrounds” -who are sick and troubled, having none to intercede for them so as to receivemiracles from the Almighty God. Thus, our Ministry is fully committed to bringGod’s immense blessings and His healing touch to millions of brokenheartedpeople in their soul, mind and body


Our motto;.


v     Wedeclare that Prayer is our Priority, Evangelism is our Passion, andDiscipleship is our Purpose.

v    To bring healing to the broken hearted, givingthem hope through prayer

v    To raise Prayer Intercessors who pray and servewith compassion.

v    Preach the Good news to the Poor and the Lost,

v    Change lives through God’s word and the power ofPrayer,

v    Transform people by Training, Mentoring andEmpowerment,

v    Hosting conferences, Seminars, Revivals andPrayer rallies

v    To raise full fledged professionals with zeal toserve the suffering humanity from the higher levels of the society filled withGod’s power and compassion inculcated through our Bible school.


Our Vision and Burden


v    RESEACH THE  UNREACHED  AND TEACH THE REACHED

v     REEACH THESCHOOLS, COLLEGES, UNIVERSITY CAMPUSES AND ALL OTHER STUDENTS

v     HELP ANDENCOURAGE THE PASTORS, EVEANGELISTS, LAY PEOPLE AND MISSIONARIES IN INDIA

v     HELPWITH  LITERATURE AUDIOS, VEDIOS,MEGAPHONES, BIBLES, TRACTS  ETC

v     HELPINGHAND TO DEPRESSED, OPPRESSED, PEOPLE WHO ARE IN HUNGRY AND ABONDON WOMEN,WIDOWS, OLDAGE PEOPLE, AND DESTITUDES.

v     BUILDCHURCHES , 

v     CONDUCTCONFERENCES, SEMINARS, WORKSHOPS FOR SPIRITUAL EDIFICATION OF THE CHURCH

v     PRINTING BOOKS, LEAFLETS AGAINST THE FALSE TEACHINGS LIKE CULTS, OCCULTS AND ALL

v     STARTSCHOOLS FOR POOR CHILDERN

v     FOOD FORTHE HUNGRY, CLOTHS FOR POOR CHILDREN, SHLTER FOR MIGRATED AND MANY MORE

v    GOD FOR THE HEATHEN GODLINESS TO HARDEN.

v    PRAYER TOWER

v     PRAYER GARDEN

v    JESUS HEALING CENTRE

v    BIBLE SCHOOL

v    OLD AGE HOME

v    MEDICAL CENTRE


Note : Please pray for the above in your daily prayers and extend your cooperation tofulfill this great vision. We are going to win this land for Jesus… Amen

 

YOURS IN HIS SERVICE

                                                            Dr.S. CHANDRA KIRAN (PhD)

                                                                  S. MANJU KIRAN (MBA)


PRAY FOR INDIA                                                                  PRAYFOR THE WORLD

 

MAYGOD RICHLY BLESS YOU

 


Welcome

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on May 14, 2010 at 4:05 AM Comments comments (0)

PSM – IVBI BIBLE SCHOOL

(Affiliated to International Victory Bible Institute, Tulsa, OK, USA)

PUNGANUR, CHITTOOR Dt. ANDHRAPRADESH, INDIA- 517247

E mail:  [email protected], web:http//www.premswaroopministries.webs.com/ Ph: 9703311304

---------------------------------------------------------------------------------------------------------------------------

 

 

Dear beloved in Christ

Let me welcome you to a ministry that desires more than anything inthis world to help you discover God’s principles to live in health, peace, joyand prosperity.


We are considering it an honor and a privilege to minister to youand those you love. We want you to know we are expecting great things for you, believingwith you and praying   god’s word overyou for you to experience the life of  victory he promise’s to those who believe


We  have  seen  the  power of  god  at work  in  our own  life’s,And we are firmly established in commandments of love that Jesus Taught in Matthew 22; 37-39. He told us that   our first   priority Is to  love  the lord   our  god and  our  second is  to  love  is Neighbors.


Often  when  I write  I   include a  , prayer  and I  would  like to

Leave this prayer with you.


        Father,thank you for leading these new friends to contact us. Wetrust You to work in their lives and lead them every day in everyway according to Your great love and mercy with which Youhave loved them. Bless the Lord! 


Please take a movement to read the enclosed Brochure, which sharesmore about the heart and soul of our ministry, and remember we are in agreementfor victory in your life. Don’t let anything in the way. Go all out for God’sbest in everything! And remember…


God is good all the time


MAY GOD RICHLY BLESS YOU LIKE NEVERBEFORE


 Rev.Dr.Ruth Plante

                                              Dr. S.CHANDRA KIRAN PhD

                                                     S. MANJU KIRAN (MBA)    

 

Vecation Bible School

Posted by Dr.CHANDRA KIRAN SAKIGARI on May 14, 2010 at 4:00 AM Comments comments (0)

PSM -IVBI BIBLE SCHOOL నిర్వహించు   

Vacation Bible School

Punganur, Chittoor (Dt,), Andhra Pradesh, India – 517247

E - Mail – [email protected], Website:http//www.premswaroopministries.webs.com/

---------------------------------------------------------------------------------------------------

 

రక్షణ మరియు ఆశీర్వాదకరమైన తేజోమయ భవిష్యత్తు, సర్వశక్తిగల దేవుని చిత్తానుసారమైన జీవితం, జయకరమైనవిద్యాభివృద్ధి మీ పిల్లలకు  అనుగ్రహింపబడునట్లుఈ సదస్సులు నిర్వహించబడును. ప్రతి ఒక్కరూ  ఆత్మీయవరములతో నింపబడి, శక్తివంతమైన దేవుని బిడ్డలుగా జీవించునట్లు ఉజ్జీవింపజేయడం ఈసదస్సు ముఖ్య ఉద్ధేశం. దేవుని వాక్యవెలుగులో జీవితాలను చక్కదిద్దుకొని దేవునికిమహిమకరముగా జీవించుటకు, మహోన్నతుడైన దేవుని జ్ఞానములో ఎదుగుటకు ఈ సదస్సు ఎంతగానో తోడ్పడుతుంది.   

 

µ    మధురమైన ఆత్మీయ గీతములు

µ    ఆత్మీయ వరములతోనింపబడిన దేశ, విదేశీ దైవజనులతో ఆత్మీయ సందేశాలు

µ    దైవజ్ఞానమునుపెంపొందించే చక్కని కథలు

µ    స్కిట్స్

µ    మోషే, అబ్రహాము, యోసేపు,ఎస్తేరు వంటి బైబిలులోని ప్రముఖుల జీవిత చరిత్రల సినిమా ప్రదర్శన

µ    బైబిల్ క్విజ్ , అంత్యాక్షరి,

µ    క్విజ్‌లో గెలుపొందినవిజేతలకు ప్రత్యేక బహుమతులు

µ    భోజన వసతి కలదు

µ    పాల్గొన్న ప్రతిఒక్కరికీ సర్టిఫికెట్  మరియు బహుమతిఇవ్వబడును.

 

గమనిక:   4  -  18  సంవత్సరముల వారికి మాత్రమే  

 

స్థలం :  యెహోవాయీరే ప్రార్థనా మందిరం, మార్కెట్ యార్డు వెనుక, పుంగనూరు.

తేదీ:  26,27,28 -  మే  - 2010                                         సమయం: 9  am -  12  pm

వివరములకు సంప్రదించండి

డా. యస్. చంద్రకిరణ్, M.A, M. Phil, PhD (Director, PSM - IVBI BIBLE SCHOOL)9703311304

రెవ. బి. ఇమ్మానుయేలు నంద   (Oasis World Ministries)  9985880617

శ్రీమతి సి.హెచ్. మంజుకిరణ్  (MBA)(Dean PSM - IVBI BIBLE SCHOOL) 8142971747

రెవ. కె. స్టీపెన్ పాల్ (Principal, PSM - IVBI BIBLE SCHOOL)  9000867953

శ్రీమతి బ్యూలావిక్టర్ (MA) (PSM - Children Home) 9642345434

కుమారి సి.హెచ్. శాంతి స్వరూప M. Tech

Bro. Dilip 


MAY GOD RICHLY BLESS YOU


Rss_feed